వివాదం: సంక్రాంతి జనవరి 14నా, 15వ తేదీన్నా?
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.
ఖగోళ పరంగా మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుటచేత సంక్రాంతి అని అన్నారు.
ఈ పండగకు "సూర్యుడు"పుష్యమాసంన మకరరాశి లో ఏ రోజు ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రమణం అంటారు.పాత పోయి క్రోత్తదనానికి స్వాగతం పలుకురోజు.ఈ రోజు సూర్యుని చుట్టు పరిభ్రమించు భూమిదిశను దీనితో సూర్యుడు కోంత ఉత్తరం వైపు మారును.ఇందుచేతనే ఈ కాలమును ఉత్తరాయణం అంటారు.

మార్పులు ఇలా ఉంటాయి..
ఈ కాలంలో సూర్యుని సంక్రమణముతో పాటు మానవ శరీరంలో భౌతికపరమైన అనేక మార్పులు చోటు చేసుకుంటుంటాయి.ఈ దృష్టిచేతనే ఈ పండగను సాంస్కృతిక పరమైన అద్భుత మహత్యము గల పర్వధినంగా మనకు శాస్త్ర ఆధారంగా పెద్దలు నిర్ధేశించినారు.

మకరరాశిలోకి ప్రవేశం
జ్యోతిష శాస్త్ర ప్రకారంగా సూర్యభగవానుడు ఏ రోజున మకరరాశిలో ప్రవేశించే పుణ్యఘడియలను ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము.సంక్రాంతి పండుగ 14 న జరుపుకోవాలా ? 15 న జరుపుకోవాలా ? అని చాలా మంది సందేహంతో ఉన్నారు.అసలు ఖగోళ ప్రకారం సూర్యుడు తేది 14 జనవరి 2018 ఆదివారము రోజు మధ్యాహ్నము 01 : 46 ని॥లకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.కావున అదే రోజునాడే మకర సంక్రాతి పండుగను శాస్త్రపరంగా ఆచరించాలి.
కావున సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయములో అపోహలొద్దు.

ముందు రోజు బోగీ
సంక్రాంతి మొదటి రోజు తేది 13-జనవరి-2018 శనివారము రోజున భోగిపండగ
, ఈ రోజు వేకువ జాముననే లేచి స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకోని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలికి భోగి మంటలలో పాత పనికిరాని వస్తువులను వేసి పీడలను,అరిష్టాలను తోలగించుకుంటారు.ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు భోగి పండ్లనును పోయడం వలన వారికి ఉన్న బాలరిష్టం తొలగుతుంది.

ఆదివారంనాడే సంక్రాంతి
సంక్రాంతి రెండవ రోజు తేది14-జనవరి-2018 ఆదివారము రోజున మకర సంక్రాంతి పండగ.ఉత్తరాయణ పుణ్యకాలం,ప్రకృతిలో మార్పు, శబరి మలలో అయ్యప్పజ్యోతి దర్షణం కలుగుతుంది. ఈ రోజు ఉదయాన్నే నుదుటన కుంకుమ బోట్టు పెట్టుకుని, నువ్వుల నూనేను గోరువెచ్చగా కాచి దానిని ఓళ్ళంతా మర్ధన చేసుకుని,నల్లనువ్వులను కొన్ని తలపై వేసుకుని, సున్నిపిండితో ఒళ్ళురుద్దుకుని తలస్నానం చేయాలి.ఈ పండగకు కొత్త అల్లుడిని,,కూతురుని ఇంటికి ఆహ్వానించుకుని కొత్త బట్టలు వేసుకుని దేవున్ని పూజించుకోవాలి.

హరికీర్తనలు ఇలా...
ప్రాంతాల,కుటుంబ ఆచారపరంగా సాంప్రదాయకంగా వేడుక చేసుకుని పరమాన్నం,పిండి వంటలు,గుమ్మడి మొదలగు వాతహరములగు కూరగాయలు మొదలగునవవి భుజించి కుటుంబ సభ్యులతో ,ఆత్మీయులతో ఎంతో సరదాగా గడుపుతారు.రైతులకు పంటపోలాల నుండి ధాన్యం ఇంటికి వచ్చేకాలం,గంగిరేద్దుల విన్యాసాలు, హరిదాసులు ఇంటింటికి వచ్చి హరికీర్తనలు చేస్తూ ఆనంద పరుస్తారు.

ముంగిళ్లలో ముగ్గులు...
స్త్రీలు రకరకాల రంగులతో అందమైన ముగ్గులు ఇంటి ముందు వేసుకుని సంక్రాంతి నోములు ,వ్రతాలు చేసుకుని నోములను ఇరుగు పోరుగువారికి ఆత్మీయులకు పంచుకుని దాంపత్య,కుటుంబ దోషాలను తోలగించుకుని దైవానుగ్రహం పొందామని సంతృప్తి చెందుతారు.పిల్లలు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. ముత్తయిదువలు విరివిగా ధాన్యం,నోరూరించే పిండి వంటలు తీపి పదార్తలు,మొదలగు వాటిని దానం చేస్తారు.అందరి కళ్ళలోనూ ఆనందం పొంగువారేది ఈ సంక్రాంతి పండగ.

మూడవ రోజు కనుమ
సంక్రాంతి మూడవ రోజు కనుమ పండగ తేది15-జనవరి-2018 సోమవారము రోజున కనుమ(కరి) ఇది రైతుల పండగ,కర్షకులకు వ్యవసాయ పంటలకు సేద్యమునకు ఉపయోగపడిన పశువులను గౌరవించే సంస్కృతిగా హిందువులు జరిపే పండగ ఇది.ఈ రోజు పశువులను మరియు కొట్టములను శుభ్రపరచి అందంగా అలంకరించుకుని పూజించుకునే రోజు.

ఉత్తరాయన ప్రవేశం
ఈ కాలంలో రవి మకరరాశి యందు ప్రవేశించే కాలంలో ఉత్తరాయణం ప్రవేశించును. అనగా సూర్యుని చలనము దక్షిణం నుండి ఉత్తరము వైపు వాలును.మకర సంక్రమణం నుండి చలి క్రమక్రమంగా తగ్గును దేహపరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటుంది. కాబట్టి ఋషులు మన ఆరోగ్య పరిరక్షణ కొరకు నువ్వులతో కూడిన పిండి వంటలను,నువ్వులనే ప్రధానంగా చేసే నువ్వుండలు(నువ్వులముద్దలు)అరిశలు,సకినాలు మొదలగు ఆహారపధార్ధాలు ఈ కాలంలో తింటే కంటికి,ఎముకలకు,శరీర చర్మము,మలబద్దకమైన సమస్యలు మొదలగు నివారించి ఆరోగ్య అభివృద్ది కలిగించే విటమిన్ "ఎ-బి" ఈ పదార్ధాల తినడం ద్వార ఆరోగ్యలాభలు కలిగి మానవుల ఆరోగ్యం కాపాడుట కొరకు వైద్యవిధాన పరంగా ఈ పండగకు తినే పధార్ధలను సూచనలు చేయడం జరిగినది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications