ఉగాది తర్వాత ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు... మీరున్నారా?
తెలుగు వాళ్ళు అత్యంత ఇష్టంగా జరుపుకునే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ మార్చి 30న తేదీన రాబోతుంది. ఉగాది తరువాత గ్రహాల స్థాన చలనం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు విపరీతమైన అదృష్టాన్ని సానుకూల ఫలితాలను పొందుతారు. గ్రహాల సంచారం ముఖ్యంగా వృషభరాశి, మిధున రాశి, సింహ రాశి, తులా రాశి, ధనుస్సు రాశి, మరియు మీన రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
వృషభరాశి
ఉగాది తర్వాత వృషభ రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఇప్పుడు వృషభ రాశి వారు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మిధున రాశి
మిధున రాశి వారికి ఉగాది తర్వాత సంపదలు వచ్చి పడతాయి. సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. ఇది వీరికి శుభాలను చేకూర్చే సమయం.
సింహరాశి
సింహరాశి వాళ్లు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వారిని వారు స్వీయ ఆవిష్కృతం చేసుకొని ముందుకు వెళతారు. ఇది సింహ రాశి వారిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపే సమయం. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది.
తులారాశి
తులారాశి జాతకులు ఈ సమయంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు .ఇప్పుడు మీరు ఏం చేసినా విజయం వరిస్తుంది. తులా రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా ఇది ధనుస్సు రాశి జాతకులకు మంచి సమయం. ఇప్పుడు మీరు ఏ పని చేసినా మంచే జరుగుతుంది.
మీనరాశి
మీన రాశి వారికి ఉగాది తర్వాత నుండి బాగా కలిసి వస్తుంది. .మీనరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీన రాశి వారు కన్న కలలు నెరవేరుతాయి. .ఆధ్యాత్మికంగాను మీన రాశి వారికి ఈ సమయంలో ఎదుగుదల ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications