2025లో ఈ రాశులవారికి దరిద్రంతో చుక్కలు చూపిస్తామని హెచ్చరిస్తున్న గ్రహాలు!
2025 సంవత్సరం రాబోతోంది. 2025 సంవత్సరంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి వివిధ గ్రహాల సంచారం అనేక సమస్యలను, కష్టాన్ని తీసుకురాబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 2025 సంవత్సరంలో గ్రహాలు రాశులు మరియు నక్షత్రాలు మారడం వల్ల ప్రభావితమయ్యే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మిధున రాశి
2025 సంవత్సరంలో మిధున రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనిచేసే చోట ముఖ్యంగా అవాంతరాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి కూడా కష్టపడవలసి వస్తుంది. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మిధున రాశి వారి సంబంధాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మిధున రాశి వారు కుటుంబ విషయంలోనూ, స్నేహితులతో ఉండే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో కొన్ని కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారి కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. ఇది మీరు నిరాశను ఫేస్ చేయాల్సిన సమయం. కర్కాటక రాశి వారికి ఉద్యోగ రంగంలో కొన్ని అడ్డంకులు వస్తాయి. ఈ సమయంలో మీరు ఇబ్బందుల నుండి బయట పడాలంటే సరైన గట్టి ప్రయత్నం చేయాలి.
ధనుస్సు రాశి
2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో శని ఉండటం వల్ల మార్చి వరకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. శని అశుభ ప్రభావాల కారణంగా కొత్త సంవత్సరం వర్తక వ్యాపారాలలోనూ, ఆర్దిక పరిస్థితులలోను కొన్ని సమస్యలను తీసుకువస్తుంది. కుటుంబ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంక్షోభం వస్తుంది.
కుంభరాశి
2025 లో కుంభ రాశి వారికి అనేక ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్తితులను చూస్తారు. బృహస్పతి నీచ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు వస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. కుటుంబంలో కలహాలు వస్తాయి.
మీన రాశి
2025 లో మీనరాశి వారికి ఏమాత్రం కలిసి రాదు. ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగా అలసిపోయినట్టు కనిపిస్తారు. ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు ఈ సమయంలో దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications