శనిజయంతి నుండి ఈ రాశులవారిపై కనకవర్షం కురిపిస్తానన్న శనిదేవుడు
మే నెలలో చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. త్వరలో శని జయంతి రాబోతుంది. మే 27వ తేదీన శని జయంతి నిర్వహించబోతున్నాం. శని జయంతి అంటే శనిదేవుని పుట్టినరోజు. శనిదేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరుగా భావిస్తారు.
మే 27 నుండి శని దేవుడి కారణంగా అదృష్ట రాశులు
శనిదేవుడు న్యాయదేవత. అటువంటి శని దేవుడు రాజుని పేదను చేయగలడు. పేదను రాజును చేయగలడు. అత్యంత శక్తివంతమైన గ్రహంగా ఉండే శని దేవుడు అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు. మే 27 నుండి శని దేవుడి కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
శని దేవుడి కారణంగా వృషభ రాశి జాతకులకు శని జయంతి నుండి కలిసి వస్తుంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు శని దేవుడు అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి కోరిన కోరికలన్నీ తీరుతాయి. కష్టపడి పనిచేసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. సహనాన్ని ఇచ్చే దేవుడు, మీ పనులు పూర్తయ్యే వరకు మీకు అండగా ఉంటాడు. అనేక ప్రయోజనాలను చేకూరుస్తాడు.
కన్యారాశి
కన్యారాశి జాతకులు శనిదేవుని కారణంగా శని జయంతి నుంచి అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ మాసంలో శని సంచారం కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. శని సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలలోనూ, ఉద్యోగ వ్యవహారాలలోనూ కన్యా రాశి వారికి శుభాలు జరుగుతాయి. ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
మిధున రాశి
మిధున రాశి జాతకులు శనిదేవుని కారణంగా అనుకూల ఫలితాలను పొందుతారు. శని జయంతి నుంచి వీరికి అన్ని విధాలుగా శుభాలు చేకూరుతాయి. మిధున రాశి వారికి శని సంచారం వల్ల వృత్తి మరియు ఆర్థిక రంగాలలో అభివృద్ధి కలుగుతుంది. ఈ సమయం మిధున రాశి వారికి అన్ని విషయాలలోనూ పురోగతి కలిగే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications