వాస్తు ప్రకారం.. ఇంట్లో మెట్ల సంఖ్య ఎంత ఉండాలి.. మలుపులు ఏ దిక్కున రావాలి?

ఇల్లు నిర్మించుకునేటప్పుడు చాలామంది పూజా గది, కిచెన్, బెడ్ రూమ్.. ప్రధాన అంశాలపైనే ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు గానీ మెట్ల అమరికను విస్మరిస్తుండటం తరచూ చూస్తూనే ఉంటాం. వాస్తు శాస్త్రంలో ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించడంలో మెట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మెట్ల నిర్మాణం సరైన దిశలో లేకపోతే అది సుఖశాంతులను దెబ్బతీసే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తోన్నారు. మెట్లకూ వాస్తు ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

నూతనంగా ఇల్లు కట్టుకునే వారైనా లేదా పాత ఇళ్లను రీమోడలింగ్ చేసుకునే వారైనా మెట్ల వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. స్థలమే కాకుండా మెట్ల బరువును కూడా వాస్తు శాస్త్రం పరిగణనలోకి తీసుకుంటుంటుంది. ఇంటి నిర్మాణం సమతుల్యంగా ఉండాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మెరుగ్గా ఉండాలన్నా మెట్ల నిర్మాణంలో సరైన వాస్తు నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం కూడా.

Staircase Vastu boosts home energy and prosperity Use odd steps Skip even numbers ending in zero

వాస్తు ప్రకారం.. ఇంటికి దక్షిణం, పడమర లేదా నైరుతి దిశలు మెట్ల నిర్మాణానికి అత్యంత అనుకూలమైనవిగా పరిగణిస్తారు. నైరుతి మూలను భారమైన వస్తువులను లేదా నిర్మాణాలను ఉంచడానికి అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. మెట్లు అనేవి ఇంటి నిర్మాణంలో చాలా బరువైన భాగం కావడం వల్ల వీటిని ఆయా దిశల్లో అమర్చేలా చేసుకోవడం ద్వారా ఇంటి నిర్మాణం సమతుల్యంగా ఉంటుంది. అది మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది.

తిరుమలలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్
తిరుమలలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్

ఈశాన్య మూలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లను నిర్మించకూడదు. ఎందుకంటే ఈశాన్య మూల అనేది పూజలు, ధ్యానానికి కేటాయించే అత్యంత పవిత్రమైన ప్రదేశం. వాస్తు ప్రకారం ఈ ప్రదేశంలో ఎప్పటికీ బరువైన వస్తువులు లేదా నిర్మాణం ఉంచకూడదు. అది మానసిక భారానికి దారి తీస్తుంది. ఈ దిక్కు.. ఎప్పటికీ కాంతిమంతం, ఖాళీగా ఉంచాలి. ఇక్కడ మెట్ల వంటి బరువైన నిర్మాణాలు చేపట్టడం వల్ల కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఇబ్బందులు తలెత్తుతాయి.

వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?

మెట్లపై పైకి ఎక్కేటప్పుడు గమనం తూర్పు నుండి పడమర వైపు లేదా ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉండేలా నిర్మించుకోవాలి. మెట్ల మలుపుల విషయానికి వస్తే, అవి ఎల్లప్పుడూ క్లాక్‌వైస్ అంటే గడియారపు ముల్లు తిరిగే దిశలో ఉండాలి. పైకి ఎదిగేటప్పుడు మెట్ల మలుపు ఎల్లప్పుడూ కుడి వైపునకు ఉండటం వల్ల ఇంటి యజమాని జీవితంలో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని నమ్ముతారు. మెట్ల సంఖ్యకు కూడా వాస్తు శాస్త్రంలో నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంది.

వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు

సాధ్యమైనంత వరకు మొత్తం మెట్ల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో.. అంటే 11, 15, 17, 21 వంటి సంఖ్యలలో ఉండాలి. సరి సంఖ్యల కంటే బేసి సంఖ్యలలో మెట్లను నిర్మించడం వల్ల జీవితంలో శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు స్థిరంగా ఉంటాయని వాస్తు నిపుణులు సూచిస్తారు. చివరిలో సున్నా వచ్చే సంఖ్యలు అంటే 10, 20.. ప్రకారం కూడా మెట్లను నిర్మించకూడదు. వాస్తు ప్రకారం మెట్లు అనేవి.. ఇంట్లో నివసించే వారి జీవిత గమనాన్ని, పురోగతిని నిర్దేశిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+