గోల్డ్.. స్లో డౌన్: బంగారం గమనంపై అంచనాలు తలకిందులు

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక గమనాలు, భౌగోళిక పరిణామాల ప్రభావం దేశంలో పసిడి ధరలపై స్పష్టంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. అమెరికా-ఇరాన్ చుట్టూ నెలకొన్న గందరగోళం ఇప్పటికీ కొనసాగుతోండటం, యూఎస్ ఉపాధి రంగానికి సంబంధించిన తాజా గణాంకాల విడుదల అనంతరం ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ మొత్తం కూడా అమెరికా ద్రవ్యోల్బణ నివేదికపై కేంద్రీకృతమై ఉంది. అక్కడి ఉపాధి గణాంకాలు బలంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం తగ్గి ఔన్సుకు 4,405.47 డాలర్లకు పడిపోగా, డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ ధర కూడా 4,452.20 డాలర్ల వద్ద స్థిరపడింది.

Gold Price in India declined today at MCX amid ongoing uncertainty over the US-Iran conflict elusive deal

ఈ ఒడిదుడుకుల వల్ల దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం, వెండి ట్రేడింగ్ సైతం నెమ్మదించింది. బంగారం ధర 0.28 శాతం క్షీణించి 10 గ్రాములకు 1,52,910 రూపాయల వద్ద నమోదైంది. మరోవైపు వెండి అమ్మకాలు కూడా దిగొచ్చాయి. ఎంసీఎక్స్ లో డిసెంబర్ వెండి ఫ్యూచర్స్ ధర 0.14 శాతం తగ్గి కిలోకు 2,36,840 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

గ్యారంటీలకు టాటా, హామీలకు బైబై: అసెంబ్లీ సమావేశాల వేళ..
గ్యారంటీలకు టాటా, హామీలకు బైబై: అసెంబ్లీ సమావేశాల వేళ..

శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 650 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్లు రూ. 600, 18 క్యారెట్లు రూ. 490 మేర తగ్గింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,640, 22 క్యారెట్లు రూ. 1,39,920, వెండి కిలో రూ. 2,36,410 వద్ద స్థిరపడింది. బెంగళూరులో ఇవే రేట్లు వరుసగా రూ. 1,52,760, రూ. 1,40,030, రూ. 2,36,590 వద్ద నమోదయ్యాయి.

Bigg Boss హౌస్ లో మేజికల్ కాంబినేషన్.. !!
Bigg Boss హౌస్ లో మేజికల్ కాంబినేషన్.. !!

హైదరాబాద్ లో 24 క్యారెట్లు రూ. 1,52,860, 22 క్యారెట్లు రూ. 1,40,122, వెండి రూ. 2,36,520 వద్ద కొనసాగింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1,53,060, 22 క్యారెట్లు రూ. 1,40,305, 18 క్యారెట్లు రూ. 2,36,830 వద్ద ట్రేడ్ అయింది.

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,415, 22 క్యారెట్లు - రూ. 14,130, 18 క్యారెట్లు - రూ. 11,900

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,416, 22 క్యారెట్లు- రూ. 14,130, 18 క్యారెట్లు - రూ. 11,561

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,416, 22 క్యారెట్లు- రూ. 14,130, 18 క్యారెట్లు - రూ. 11,561

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,416, 22 క్యారెట్లు- రూ. 14,130, 18 క్యారెట్లు - రూ. 11,561

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,416, 22 క్యారెట్లు- రూ. 14,130, 18 క్యారెట్లు - రూ. 11,561

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,416, 22 క్యారెట్లు- రూ. 14,130, 18 క్యారెట్లు - రూ. 11,561

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+