మార్చిలో వీరికి సంపదల మూటలను సిద్ధం చేస్తున్న శుక్రాదిత్య రాజయోగం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. ఈ విధంగా చేసే గ్రహ సంచారాలు అనేక రాజయోగాలకు కారణంగా మారుతాయి. గ్రహాల సంచారాలు, గ్రహాల సంయోగాలు ద్వాదశ రాశుల వారి జీవితం పైనే కాకుండా దేశం పైన, ప్రపంచం పైన కూడా ప్రత్యక్షమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
మీనరాశిలో సూర్య శుక్రుల సంయోగం
మార్చి నెలలో గ్రహాల రాజు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే శుక్రుడు మీనరాశిలో ఉండటంతో సూర్య, శుక్రుల సంయోగం జరుగుతుంది.. ఈ స్థితిలో మార్చి నెలలో శుక్రాదిత్యరాజ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా మిధున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి యొక్క కర్మ గృహంలో రాజయోగం జరుగుతోంది. దీంతో మిధున రాశి వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కార్యాలయంలో కొత్త పనులను ప్రారంభించవచ్చు. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి.
కుంభరాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో సంపదను పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఎక్కడో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ సమయంలో తగ్గుతాయి. ఈ సమయంలో ఆర్ధిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది కుంభ రాశి వారికి మంచి సమయం.
వృశ్చిక రాశి
శుక్రాదిత్య రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో పురోగమనాన్ని చూస్తారు. వృశ్చిక రాశిలో ఐదవ ఇంట్లో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల పిల్లల పురోగతి కనిపిస్తుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ పెద్దల సహకారంతో ప్రతి కోరికను తీర్చుకోగలుగుతారు. కుటుంబంలో ప్రేమతో సంతోషం నెలకొంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications