డిసెంబర్ 2 వరకు ఈ రాశులవారికి సంపదలనిచ్చి సుడి తిప్పిన సూర్యుడు

గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడి సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు ప్రతినెల తన రాశిని మార్చుకుని కదులుతూ ఉంటాడు. అంతే కాదు సూర్యుడు నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు శని నక్షత్రమైన అనురాధ నక్షత్రం లోకి నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలు మూడు నిమిషాలకు ప్రవేశించాడు.

డిసెంబర్ రెండవ తేదీ వరకు సూర్య నక్షత్ర సంచారం
అనురాధ నక్షత్రంలోకి సూర్యసంచారం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. శని నక్షత్రమైన అనురాధ నక్షత్రంలో సూర్య సంచారం డిసెంబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతుంది. మరి సూర్య సంచారం వల్ల అదృష్టం కలిసి వచ్చే ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Sun entered the star of Saturn anuradha filled these zodiac signs with the radiance of wealth

మేషరాశి
మేషరాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. అనురాధ నక్షత్రంలోకి సూర్య సంచారం కారణంగా మేషరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సాధ్యమవుతుంది. కష్టపడి పని చేసేవారు పనిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా ఈ సమయం ప్రయోజనదాయకంగా ఉంటుంది. మేష రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

మిధున రాశి
మిధున రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మిధున రాశి వారి జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

కన్యారాశి
కన్యా రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి వారి ధైర్యం మరియు విశ్వాసం ఈ సమయంలో బాగా పెరుగుతుంది. కన్య రాశి వారు ఈ సమయంలో కుటుంబం నుంచి మద్దతు పొందుతారు. పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడిని పొందుతారు. ఎలాంటి క్లిష్టమైన పనులలోనైనా కన్య రాశి వారు విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి
సూర్యుడి నక్షత్ర సంచారం ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ప్రత్యర్థుల పైన విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులలో సానుకూల తీర్పులు వస్తాయి. కెరీర్ లో నూతన అవకాశాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఉద్యోగం చేసేవారు గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉంది.

మీనరాశి
మీన రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. మీన రాశి వారు ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. విదేశాలలో విద్యనభ్యసించాలనుకున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ సమయంలో మీన రాశి వారికి మంచి రోజులు వస్తాయి. సామాజిక కార్యక్రమాలలో మీనరాశి జాతకులు పాల్గొంటారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+