సింహరాశిలో ఆగస్టు 17న సూర్య గోచారం.. వీరింట సిరి సంపదల ప్రకాశం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజు సూర్యుడు ప్రతీ నెల ఒక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు, ఆగస్ట్ 17, 2026 ఉదయం 7:58 గంటలకు తన స్వరాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు అక్కడే సెప్టెంబర్ 17 వరకు ఉంటాడు.

సూర్య సంచార ప్రభావం

ఈ కాలంలో సూర్యుని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. సూర్యుడు ఆత్మవిశ్వాసానికి , నాయకత్వం, అధికారం, గౌరవం వాటి వాటికి అధిపతి. అందువల్ల ఈ సూర్య గోచారం అన్ని రాశులపై ప్రభావం చూపినా, కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభఫలితాలు అందిస్తుంది.

Sun Transit in Leo on august 17th Progress and Profit for Libra 5 Other Zodiac Signs for one month

మేష రాశి

మేష రాశి వారికి సూర్య సంచారం కారణంగా ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది . శ్రమకు తగిన ప్రతిఫలం లభించి వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. కసృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం.

మకర రాశి

మకర రాశి వారికి సూర్య సంచారం శుభ ఫలితాలకు కారణం అవుతుంది.ఈ సమయంలో ఊహించని విధంగా ధన లాభం కావచ్చు. చాలా కాలంగా బకాయి ఉన్న డబ్బు తిరిగి రావచ్చు. ఉద్యోగులకు అధికారుల మద్దతు లభించి, కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త వినియోగదారులు వచ్చి మంచి లాభాలు రావచ్చు. ఆర్థిక స్థితి బలపడుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి సూర్యుడు స్వరాశిలోకి రావడం అత్యంత శుభకరంగా ఉంటుంది. అదృష్టం పెరిగి, చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభించి ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది.

తులా రాశి

తులా రాశి వారికి సూర్య గోచారం స్వర్ణావకాశాలు తీసుకువస్తుంది. ఇప్పటివరకు చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. స్నేహితుల సహకారంతో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు, వృద్ధి కనిపిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. వాహనం లేదా ఇల్లు కొనే కల నెరవేరే అవకాశం ఉంది.

శని, సూర్యులతో శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులవారికి పండుగ మొదలైంది!
శని, సూర్యులతో శక్తివంతమైన రాజయోగం.. ఈ రాశులవారికి పండుగ మొదలైంది!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారి సూర్య సంచారం అత్యంత శుభకరంగా ఉంటుంది. కార్యాలయంలో పరిశ్రమకు మెప్పు లభించి, ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. నాయకత్వ గుణాలు వెలుగులోకి వచ్చి అధికారుల విశ్వాసం సంపాదిస్తారు. వ్యాపారులకు వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+