శత్రు నక్షత్రంలోకి సూర్య సంచారం.. త్వరలో వీరికి ఆకస్మిక ధనలాభం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలకు రారాజుగా సూర్యభగవానుడిని పిలుస్తారు. సూర్య సంచారం ప్రతినెలా జరుగుతుంది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి, ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి సంచరిస్తూ ఉంటాడు. ఈ సంచారం అన్ని రాశులవారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక సూర్యుడి నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ది జరుగుతుంది.
సూర్యుడి శత్రు నక్షత్ర సంచారం
సూర్యుడి నక్షత్ర సంచారం 14 రోజులకు ఒకసారి జరుగుతుంది ప్రస్తుతం సూర్యుడు బుధుడి యొక్క ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు . ఆగస్టు 16 2024న రాత్రి 7.53 నిమిషాలకు మఖా నక్షత్రంలోకి మారుతాడు. మఖా నక్షత్రానికి కేతువు అధిపతి .కేతువు సూర్యుడికి శత్రువు. ఇక శత్రు నక్షత్రంలో సూర్య సంచారం జరిగినప్పటికీ సూర్యుడు రాశిని అదేరోజు మారుతున్న నేపథ్యంలో కొన్ని రాశులవారికి అఖండ ధనలాభం కలుగుతుంది.

మిధున రాశి
సూర్యుడు శత్రు నక్షత్ర సంచారం మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. సూర్యుని యొక్క నక్షత్ర సంచారం మిధునరాశి వారి మూడవ ఇంట్లో జరుగుతుంది. దీని కారణంగా మిధున రాశి జాతకులు ఉన్నత ప్రయోజనాలను పొందుతారు. వీరు జీవితంలో అన్ని రంగాలలోనూ అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
కర్కాటక రాశి
మఖా నక్షత్రంలో సూర్యసంచారం కర్కాటకరాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. కర్కాటకరాశిలో రెండవ ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. దీని కారణంగా కర్కాటకరాశి జాతకులు పెట్టే పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను పొందుతారు. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. కర్కాటకరాశిలో ఉన్న వారు కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. జీవితంలోని అనేక అంశాలలో వీరు విజయాన్ని సాధిస్తారు.
వృశ్చిక రాశి
మఖా నక్షత్రంలో సూర్యసంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వృశ్చికరాశి వారు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో ఏ పని చేసిన అదృష్టం కలిసొస్తుంది. సూర్య భగవానుడు ఆశీర్వాదం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలోనూ గణనీయమైన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications