మార్చిలో నక్కతోక తొక్కే రాశులివే.. వీరింట కాసుల పంట!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా అనేక రాశుల వారి జీవితాలలో మార్పులు వస్తున్నాయి. ఇక మార్చి నెలలో సూర్యుడు, శని, శుక్రుడు, బుధుడు చేసే సంచారం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట రాశులుగా మారుతున్నారు. మార్చిలో సూర్యుడు, శని సంయోగం 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో జరుగుతుంది.
మార్చిలో గ్రహాల సంచారం
మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 29వ తేదీన శని కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా అనేక రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇక మార్చి మాసంలో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మార్చి నెలలో గ్రహాల సంచారం కారణంగా మేష రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. మేష రాశి వారి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. మేష రాశి వారు ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక స్థితిని చూస్తారు. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని చూస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు వాటిలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయం మేష రాశి వారికి కలిసి వస్తుంది.
మిధున రాశి
మార్చి నెలలో మిధున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మార్చి నెలలో మిధున రాశి జాతకులు ఏ పని చేసినా లబ్ధి చేకూరుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ప్రయోజనాలు వస్తాయి. మిధున రాశి జాతకులు డబ్బు సాధించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల నుండి ఆస్తులు వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు మార్చి నెల అదృష్టాన్ని తీసుకురాబోతుంది. మార్చి నెలలో వీరు ఉద్యోగాలు చేసే చోట పురోగతిని సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లబ్ధి జరుగుతుంది. మార్చి నెలలో మీకు అద్భుతమైన వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి. గతంలో కంటే నాలుగు రెట్లు లాభాలు అధికంగా సాధిస్తారు. ఇది డబ్బు సంపాదించడానికి కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యమైన సమయం.
కుంభరాశి
కుంభ రాశి వారికి మార్చి నెలలో గ్రహాల సంచారం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆర్థిక పురోగతి సాధిస్తారు. కుంభ రాశి వారు శ్రమకి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ప్రభుత్వం కోసం పనిచేయడంలో విజయం సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. కుంభ రాశి వారి ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది.
మీనరాశి
మార్చి నెలలో మీన రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీనరాశిలోని అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. పనిలో సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారులతో మన్ననలు పొందుతారు. విదేశాల నుండి కూడా మీనరాశి జాతకులు ఈ సమయంలో ప్రయోజనాలు పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications