బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే

వేద జ్యోతిష్యంలో సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. దీని కారణంగా ఏదైనా రాశిచక్రంలో సూర్యుని సంచారం చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ 14న సూర్యుడి రాశిలో మార్పు జరిగి మే 14వ తేదీ వరకు మేషరాశిలో ఉండబోతున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో బుధుడున్నాడు. సూర్యుడు, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించిన తర్వాత బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఒక వ్యక్తి జాతకంలో బుధుడు, సూర్యుడు కలిసివున్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు, సంపద, గౌరవం లభిస్తాయి. అరుదైన ఈ రాజయోగం మరికొన్ని రోజులు ఉండబోతోంది. ఈ యోగంవల్ల ఏ రాశులవారికి లాభమో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో అధిక లాభాలను పొందడంతోపాటు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పిల్లలవైపు నుంచి కొన్ని శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు అందులో విజయం సాధిస్తారు. మవుతున్నట్లయితే, మీరు దానిలో విజయం సాధిస్తారు. అవివాహితులకు వివాహమవుతుంది.

 horoscopes

కర్కాటక రాశి
ఉద్యోగంలో వృద్ధితోపాటు ఆర్థిక లాభాలుంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలని ఆలోచించేవారికి ఆ దిశగా అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉండటంతోపాటు తమ్ముళ్ల మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తమ వృత్తి రీత్యా దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది.

సింహ రాశి
ఈ రాశివారికి అధిపతి సూర్యుడు. సూర్యుడి సంచారం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉండటంతోపాటు ఇతరుల దగ్గర ఆగిపోయిన మీ డబ్బు మళ్లీ చేతికందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. ఊహించనిరీతిలో వీరికి ఆదాయం పెరుగుతుంది. ప్రేమ విషయంలో విజయంతోపాటు విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఉన్నత విద్యకు అవకాశం లభిస్తుంది. ఉద్యోగం కోసం చూసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలు బలంగా ఉండటంతోపాటు వివాహం చేసుకోవాలని భావించేవారికి ఈ సమయం చాలా మంచిది. భాగస్వామితో వ్యాపారం చేయడానికి కూడా ఇది అనుకూల సమయం.

కుంభరాశి
వీరికి సుదీర్ఘ ప్రయాణం చేయాలనిపిస్తుంది. మీడియాలో ఉన్నవారికి నూతన అవకాశాలు తలుపు తడతాయి. తండ్రితో సంబంధం బలపడుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు కార్యాలయంలో వీరు చేసే పనిపట్ల సీనియర్లు సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+