కుంభరాశిలో సూర్యుడు, శని.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
శని, రవి.. రెండు గ్రహాలు తండ్రీ కొడుకులే. అయినప్పటికీ వీరిద్దరు ప్రబల శత్రువులు. ఒకేరాశిలో ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తుంటే శుభ ఫలితాలు ఇస్తాయి. శని ఐశ్వర్యాన్ని, రవి అధికారాన్ని ఇస్తారు. దీనివల్ల ఏయే రాశులవారి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరగనుందో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశివారికి రాజయోగం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానానికి వెళ్లడంతోపాటు మనసులోని కోరికలు కూడా నెరవేరతాయి. సంపద పెరగడంతోపాటు వాహన, గృహ యోగాలున్నాయి. కొత్త దుస్తులను కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగుతాయి.

వృషభం
అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవడంతోపాటు రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. పలు మార్గాలద్వారా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని రీతిలో మంచి ఉద్యోగం లభిస్తుంది.
కన్య
రుణవిముక్తి కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా ఏ చిన్న ప్రయత్నం చేసినా బాగా కలిసివస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలుంటాయి. అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆఫర్ ఉంది.
తుల
పోటాపోటీగా ఆదాయాన్ని వృద్ది చేస్తారు. అంచనాలకు మించి రాబడి ఉంది. తండ్రి నుంచి ఆస్తి కలిసివస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు ఉన్నాయి.
ధనుస్సు
రాజయోగం పడుతుంది. మాటలకు, పనులకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.
మకరం
ఆకస్మిక ధనలాభం ఉంది. శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. ఆర్థికంగా ఏ పని తలపెట్టినా విజయవంతమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications