2027 వరకు వీరికి అఖండ రాజయోగం.. వరమిచ్చిన శని దేవుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని దేవుడిని కర్మదేవుడిగా చెబుతారు. కర్మలకు అధిపతిగా, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే శని దేవుడు ద్వాదశ రాశుల వారి జీవితాల పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని వేస్తాడు. శని ఆగ్రహం కారణంగా రాజు కూడా పేదవుతాడు. అదే శని కటాక్షంతో చూస్తే మాత్రం నిరుపేద కూడా కోటీశ్వరుడై దేశాన్ని ఏలతాడు.
శని కటాక్షంతో రాజయోగం
శని దేవుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో ఓ రెండు రాశుల వారికి అత్యంత విశేష యోగం కలుగుతుంది. వీరికి రెండేళ్ల వరకు రాజయోగం కలగబోతుంది. మరి శని కటాక్షం కారణంగా రాజ యోగాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
శని దేవుడి దయ కారణంగా వృషభ రాశి వారికి వర్తక వ్యాపారాలలో గణనీయమైన లాభాలు వస్తాయి. శని కటాక్షం వృషభ రాశి వారిపై కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు వృషభ రాశి వారి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుంది. అంతే కాదు మీరు అప్పుల భారం నుంచి బయటపడతారు. సుఖ సంతోషాలతో జీవిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంలో మునిగి తేలుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలలో కూడా రాణిస్తారు. విద్యార్థులకు,పోటీ పరీక్షలు రాసే వారికి కూడా శని మంచి ఫలితాలనే ఇస్తాడు.
మకర రాశి
మకరరాశి వారికి శని దయ కారణంగా రాజయోగం పట్టబోతుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రెండేళ్ల వరకు మకరరాశి వారు తిరుగు లేనివారిగా చక్రం తిప్పుతారు. మకర రాశి వారు ఈ సమయంలో ఏం చేసిన సానుకూలమైన ఫలితాలే వస్తాయి. ఇది వీరికి అదృష్టాన్ని తెచ్చి పెట్టే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications