మర్చిపోకండి.. మే 10న ఈ పరిహారాలతో ఈ రాశులవారికి శనిబాధల నుండి విముక్తి
ద్వాదశ రాశుల వారి జీవితాలలో ఏదో ఒక సమయంలో శని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. శని సంతోషాలను మాత్రమే కాదు కఠినమైన సమయాలను, దుఃఖాలను కూడా ఇచ్చే దేవుడు. అటువంటి శని దేవుడు కొన్ని రాశుల వారి జీవితాలలో ఈ సంవత్సరం కష్టాలను కలిగిస్తున్నాడు. ఇక ఆయా రాశుల వారు మే 10వ తేదీన శని త్రయోదశి రోజు కొన్ని పరిహారాలు చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.
మేషరాశి
మేషరాశి జాతకులు ఏలినాటి శని తో ప్రస్తుతం బాధపడుతున్నారు. ఏలినాటి శని ప్రభావంతో ప్రతికూల ఫలితాలను చూస్తున్నారు. ఆకస్మికంగా ఖర్చులు పెరగడం, ఉద్యోగాలలో ఇబ్బందులు రావడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వీరు శని త్రయోదశి రోజు శని దేవుడికి తైలాభిషేకం చేస్తే ఉంటుంది.

సింహరాశి
సింహరాశి జాతకులు ఈ సంవత్సరం అష్టమ శని తో బాధపడుతున్నారు. దీని ప్రభావం వల్ల వీరు ఎంత శ్రమ పడినప్పటికీ ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. భగవంతునికి సేవ చేయడం ద్వారా శనిని ప్రసన్నం చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శని త్రయోదశి నాడు శని దేవుడికి నెయ్యి దీపం వెలిగించడం వీరికి శుభాలను చేకూరుస్తుంది.
కన్యారాశి
కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శని సంచారం వల్ల మీరు ఏ నిర్ణయం తీసుకున్న ఆలస్యం కావడం పని ఒత్తిడికి లోను కావడం వంటి సమస్యలు వస్తున్నాయి. కన్యా రాశి వారు శని దేవుడికి కొబ్బరి నూనెతో శని త్రయోదశినాడు అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ధనుస్సు రాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ ఒత్తిడిలు, గృహ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పాడవుతుంది. ఇక ఈ ప్రభావం నుంచి బయటపడటానికి వీరు శని త్రయోదశినాడు శివుడిని, శనిదేవుడిని పూజించడం, ఆలయాలకు వెళ్లి రావడం వంటివి చేస్తే మంచిది.
కుంభరాశి
కుంభ రాశి వారికి కూడా ఏలినాటి శని చివరి దశలో ఉన్న కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీరు శని దేవుడికి నల్లటి వస్త్రాలు, నల్ల నువ్వులు వంటివి సమర్పించి పూజిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి వారికి రెండవ దశ ఏలినాటి శని ప్రారంభమైంది. దీని ప్రభావం వల్ల మీనరాశి జాతకులు వృత్తి ఆరోగ్య కుటుంబ సంబంధమైన సమస్యలలో చిక్కుకుంటారు. వీటి నుండి బయటపడడానికి శని త్రయోదశి రోజు రాశి వారు శని పూజ చేయాలి. నల్ల నువ్వులు, నీలి వస్త్రాలను సమర్పించి పూజిస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications