రోహిణీ నక్షత్రంలోకి బృహస్పతి.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నక్షత్రాన్ని మార్చినప్పుడు కూడా ఇవే ఫలితాలు కలుగుతాయి.
దేవ గురువు బృహసపత్రి నక్షత్రాన్ని మార్చి రోహిణీ నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురుడు గత నెల 13న రోహిణీలోకి ప్రవేశించాడు. ఆగస్టు 20వ తేదీ వరకు ఇక్కడే ఉంటాడు. అప్పటివరకు కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏయే రాశులవారికి ఏవిధంగా లాభాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.

మేషరాశి
ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబంలో తలెత్తిన ఆర్థిక సంబంధ గొడవలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్స్ ఉన్నాయి. అయితే వీరు ఎంత కష్టపడితే అంతమేరకు పేరు తెచ్చుకుంటారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలు కూడా ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి.
వృషభరాశి
రోహిణీ నక్షత్రంలోకి గురుడు ప్రవేశించడంవల్ల వీరికి ఎంతో లాభసాటిగా ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. గురువును పూజించడంవల్ల మున్ముందు అన్నీ మంచి ప్రయోజనాలే కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలు సమసిపోతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేస్తే బాగా కలిసిరావడమేకాదు.. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
మిథునరాశి
ఆర్థికంగా వీరు ప్రయోజనాలు పొందుతారు. ధనప్రవాహం పెరుగుతుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి బాగుంటుంది. అలాగే కొత్త స్థలాన్ని కూడా కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న వివాదాలు నిత్యం భార్యాభర్తల మధ్య చికాకును కలిగిస్తుంటాయి. అవి కూడా పరిష్కారమవుతాయి.
కర్కాటక రాశి
గురు గ్రహ సంచారం వల్ల మిధున రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు ధన ప్రవాహం పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంది
సింహరాశి
వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలున్నాయి. వ్యాపారాలను విస్తరించడంతోపాటు కొన్ని కొన్నింటిల్లో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలంలో వీటినుంచి మంచి రాబడిని సంపాదిస్తారు. గురుడి సంచారం వీరికి అనేక లాభాలను కలిగిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
ధనస్సు రాశి
అందరికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందే రాశి ఇదే. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.












Click it and Unblock the Notifications