కేతువు వల్ల వచ్చే ఏడాది చివరి వరకు ఈ రాశులకు తిరుగులేదు

ప్రస్తుతం కన్యారాశిలో సంచారం చేస్తున్న కేతువు గతేడాది అక్టోబరు 30వ తేదీన ఇందులోకి ప్రవేశించి 2025 మే 18 వరకు వరకు ఉంటాడు. ఆ తర్వత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే ప్రధానంగా మేష రాశి, కర్కాటక రాశి, కన్యారాశి, వృశ్చికరాశివారికి విపరీతమైన ప్రయోజనాలను ఇవ్వబోతున్నాడు. కేతువు అంటేనే ఆధ్యాత్మిక గ్రహం అని అర్థం. దీని ప్రభావంవల్ల అందరూ భౌతిక సుఖాలకు, ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. అదృష్టాన్ని ఇవ్వడమే కాకుండా భారీ లాభాలను కూడా ఆర్జించి పెడుతుంది.

మేష రాశి
ఆరో ఇంట్లో కేతువు ఉండటంవల్ల ఆర్థికంగా లాభాలున్నాయి. ప్రయత్నాలు చేయడంవల్ల విజయం సాధించడంతోపాటు ఎంత కష్టపడితే ఆ శ్రమకు తగ్గ లాభాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. 2025 చివరకు కెరీర్ పరంగా ఈ రాశులవారు అతి భారీ విజయాన్ని దక్కించుకుంటారు. వివాహం కానివారికి పెళ్లి కుదురుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది.

these zodiac signs very lucky due to ketu transit in virgo

కర్కాటక రాశి
ఈ రాశివారికి 2025 చివరి వరకు తిరుగులేదు. కొత్త ఉద్యోగాలను పొంది మెరుగైన స్థితిలో నిలుస్తారు. డబ్బు సంపాదనకు మంచి మార్గాలు అందుబాటులోకి వస్తాయి. కెరీర్ పరంగా ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఇందుకు అదృష్టం తోడవుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నప్పటికీ అవి ఈ సమయంలో దూరమవుతాయి.

కన్యా రాశి
ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి ఆదాయం పెరిగి స్థిరపడతారు. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం మధురంగా గడుస్తుంది. చిన్న చిన్న అనారోగ్యాలున్నాయి. వాటికి అధైర్యపడాల్సిన అవసరంలేదు.

వృశ్చిక రాశి
కెరీర్ లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పనిచేసే కార్యాలయంలో నాయకుడిగా రాణిస్తారు. ఏ పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. అయితే ఈ ప్రయాణాలు ఆర్థికంగా లాభసాటిగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+