రాహువుతో భయం లేదు.. ఈ రాశులపై కనక వర్షం
ప్రతి 18 నెలలకు ఒకసారి రాహువు తన రాశిని మార్చుకుంటాడు. వచ్చే ఏడాది మే నెలలో రాహువు తన రాశిని మార్చబోతున్నాడు. ఆ నెల 18వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే అదృష్టం మారిపోతుంది. కుంభరాశికి శనిదేవుడు అధిపతి. ఈ పరిణామాలవల్ల కొన్ని రాశులవారి అదృష్టం పూర్తిగా మారిపోతోంది. రాహువు, శని ప్రభావం కలిసివస్తుండటంతో కోటీశ్వరులు కాబోతున్నారు. ఏరాశులవారికి అదృష్టం వరిస్తుందో, వారి జీవితం ఎలా ప్రకాశవంతం కాబోతుందో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
కుంభరాశిలో రాహువు సంచారం వీరి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాపారస్తులకు సమయం బాగుంది. మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులకు ఎంతో అనుకూలమైన సమయం. డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మేష రాశి
రాహువు రాశిని మార్చిన తర్వాత విజయం సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఆర్థికంగా లాభాలున్నాయి. వ్యాపారస్తులు శుభవార్తలను అందుకుంటారు. పాత స్నేహితుడిని కలుసుకోవడంవల్ల ఆనందం కలుగుతుంది.
కన్యా రాశి
కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. దూరప్రాంతం ప్రయాణించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సులువుగా విజయాన్ని అందుకుంటారు.












Click it and Unblock the Notifications