మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం

వచ్చే నెల ఒకటో తేదీన గురుడు మేషరాశిని వదిలిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దేవతలకు గురువైన బృహస్పతి ఏడాదికోసారి తన రాశిని మారుస్తుంటాడు. ఈ మార్పు ప్రభావం 12 రాశిచక్రాలపై ఉంటుంది. గురుడు వృషభరాశి ప్రవేశం వల్ల నాలుగు రాశులవారు మంచి పేరు ప్రతిష్టలను పొందనున్నారు. వారికి ఏ విధంగా కలిసి రానుంది, ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి
వీరికి అదృష్టం పట్టబోతోంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వివిధ మార్గాలద్వారా ఆదాయం వస్తుంది. అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు మార్గాలు తెరుచుకుంటాయి. ఆధ్యాత్మిక, మతపరమైన విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కార్యాలయంలో చేసిన పనికి యజమాని నుంచి, పై అధికారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ జీవనంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

these zodiac signs will get more money due to Jupiter Transit in taurus 2024

మేష రాశి
గురుడు ఈ రాశి వదిలిపెట్టే వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఎన్నడూ చూడని లాభాలను చూడటంతోపాటు రాబోయే నెలరోజులు వీరు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. కార్యాలయంలో వేతనాలు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు. పెట్టే పెట్టుబడులద్వారా లాభాలున్నాయి.

కర్కాటక రాశి
గురువు సంచారం ఈ రాశివారికి గతంలో ఎన్నడూ ఇవ్వని లాభాలను అందిస్తాయి. ఈ సమయంలో వీరు కోరుకున్నదల్లా జరుగుతుంది. కెరీర్ లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి.

సింహరాశి
ఈ రాశివారిని బృహస్పతి అప్పుల నుంచి విముక్తి చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు విజయం సాధిస్తారు. పూర్వీకుల నుంచి స్థిర చరాస్తులు కలిసివస్తాయి. ఎన్నడూ చూడని లాభాలను కళ్లచూడటంతోపాటు కెరీర్ మలుపు తీసుకుంటుంది. దీనివల్ల అదృష్టం కలిసివస్తుంది. సన్నిహితులతో లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్లడానికి అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+