S అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వం ఇలా.. ఈ ఒక్కటే వారిలో మైనస్!!
పేరును బట్టి కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం ఉంటుంది. కొన్ని పేర్లు తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకువస్తే, కొన్ని పేర్లు నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చెబుతాయి. ముఖ్యంగా 'S' అనే అక్షరంతో చాలామంది పేర్లు ప్రారంభమవుతాయి.
ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? జ్యోతిష్య శాస్త్రం వారి గురించి ఏం చెప్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారి మనసులోని భావాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు. వారు చాలా సహజంగానూ, వాస్తవికంగానూ ఉంటారు.

ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారై ఉంటారు. వారు లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా ఉండరు. కృత్రిమంగా ఉండడం, నటించడం వారికి అస్సలు రాదు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. వారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటారు.
వారు తమ జీవిత భాగస్వామికి సంతోష మరియు దుఃఖ సమయాలలో మద్దతు ఇచ్చే వ్యక్తులుగా నిలుస్తారు. ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి శృంగార స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు ఖరీదైన బహుమతులకు బదులుగా తమ ప్రేమను నమ్మకంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారు.
ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా దయాగుణం కలవారై ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం వారికి ఉంటుంది. వీరికి ఎవరినీ మోసం చెయ్యటం రాధు. వీరికి డబ్బు విలువ తెలుసు. అలాగని డబ్బే వీరి ప్రపంచం కాదు. వీరు స్నేహానికి బాగా విలువనిస్తారు.
వారు ఏ కార్యక్రమమైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. వీరు పుట్టుకతోనే నాయకులు. జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. వీరు చాలా విశ్వసనీయులు. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. సహజంగా కోపం రాదు. కోపం వస్తే మాత్రం వీరిని ఆపటం కష్టం. కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ఉన్న అతిపెద్ద బలహీనత అని చెప్పవచ్చు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications