గురు బలంతో ఇల్లు, కారు కొనే రాశులు వీరే

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు, మరికొన్ని రాశులకు వారి కర్మల ప్రకారం ప్రతికూల ఫలితాలను ప్రసాదిస్తుంటాయి. దేవతల గురువైన బృహస్పతి జాతకంలో అనుకూలంగా ఉంటే అన్నీ సమకూరతాయి. ఆధ్యాత్మికతకు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు, సంతానానికి, శ్రేయస్సుకు, అదృష్టానికి, వివాహానికి కారకుడు గురుడు. నవగ్రహాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదించే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఏయే రాశులకు బాగా కలిసిరానుందనే వివరాలను తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం చాలా సుఖంగా ఉంటుంది. సంతోషంగా భార్యాభర్తలు జీవిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయాన్ని అందుకుంటారు. జీవితంలో వృత్తి పరంగా, వ్యాపార పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. అలాగే వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు గురువును పూజించడంవల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.

three zodiac signs will become millionaires due to Jupiter blessings

వృశ్చిక రాశి
ఒకరకంగా చెప్పాలంటే వీరికి అదృష్టం అనేది దరిద్రం పట్టినట్లు పట్టుకుంటుంది. ఇప్పటివరకు ఉన్న రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు మరింత ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఏ పని తలపెట్టినా పెద్దల సలహా తీసుకోవాలి.

తులా రాశి
వ్యాపారస్తులకు అన్నీ లాభాలే కలుగుతాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగస్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుదలతోపాటు పదోన్నతి ఉంది. ఊహించనిరీతిలో ధనలాభాన్ని పొందుతారు. మాటతీరు విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు బయట తక్కువ మాట్లాడుతుండటం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+