శనిదేవుడి మాయాజాలం... ఈ రాశులకు 7 నుంచి కుబేర యోగం

చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అందిస్తాడు శనిదేవుడు. ఆయన న్యాయానికి ప్రతీక. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే అంతకు రెట్టింపుస్థాయిలో చెడు ఫలితాలను ఇస్తాడు. ఏప్రిల్ 28వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శనిదేవుడు ఈనెల 7వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోని రెండో పాదంలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఏయే రాశులకు శనిదేవుడు మంచి ప్రయోజనాలను కల్పించనున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం.

కర్కాటక రాశి
వీరికి చాలా మేలు కలుగుతుంది. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు. పదిమందికి సాయం చేస్తారు. వ్యాపారాలు చేస్తున్నవారికి అవి లాభసాటిగా మారతాయి. డబ్బును పొదుపు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలున్నాయి. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు, వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తిపరంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

three zodiac signs will get amazing benefits and huge money due to Saturn will enter Uttarabhadra nakshatram

మకర రాశి
గతం నుంచి వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కాలాన్ని వృథా చేయకుండా మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండటంవల్ల ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. డబ్బుపరంగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు.

కన్యా రాశి
పెళ్లి కానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఆనందం రెట్టింపు అవుతుంది. వారి జీవితం చాలా సాఫీగా, సంతోషంగా సాగుతుంది. మనస్పర్థలు ఉండవు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం కలిసివచ్చు విశేషమైన ప్రయోజనాలను అందుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కలిగివుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలను అందుకోబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+