అక్టోబర్ ఆరంభంలో త్రిగ్రాహి యోగం.. మూడు రాశులవారికి డబ్బే డబ్బు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం వివిధ రాశులపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అక్టోబర్ ఒకటవ తేదీన ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అక్టోబర్ ఒకటో తేదీన కన్యారాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. బహుళ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ త్రిగ్రాహి యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇక ఆ మూడు రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మిథున రాశి: మిధున రాశి వారికి త్రిగ్రాహి యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. త్రిగ్రాహి యోగం కారణంగా మిధున రాశి జాతకులు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. రియల్ ఎస్టేట్, ఆస్తులు, వాహనాలలో పెట్టుబడులకు ఇది వారికి సరైన సమయం. ఇక ఉద్యోగాలు చేసే వారు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది.

కొత్త బాధ్యతలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వాటిని కూడా చక్కగా నిర్వహించి , మంచి పేరును సంపాదిస్తారు. పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశం ఉంది. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మిధున రాశి వారికి ఈ యోగం వల్ల పెరుగుతాయి.
సింహరాశి: సింహ రాశి వారికి త్రిగ్రాహి యోగం వారికి మంచి ధన లాభాన్ని కలిగిస్తుంది. సింహరాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే సమయం. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. సింహ రాశి వారు అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబం యొక్క మద్దతు పెరుగుతుంది. ఈ సమయంలో ఊహించని ద్రవ్య లాభాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల బాగా కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకుల కెరీర్ ఈ సమయంలో బాగుంటుంది. మంచి లాభదాయకమైన ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి వస్తాయి. ప్రమోషన్లు, జీతాలు పెరుగుదల ప్రధానంగా కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే వారు విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఈ సమయంలో కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications