vasant panchami 2024: నేడు అద్భుత శుభయోగాలతో వసంతపంచమి; ఈ రాశులపై కనకవర్షం!!

ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షం 5వ తిధిన వసంత పంచమి జరుపుకుంటాం. ఈ సంవత్సరం వసంత పంచమి నేడు హిందువులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. సరస్వతీదేవిని విశేషంగా పూజించి, ప్రత్యేకంగా నైవేద్యాలను సమర్పించి, పిల్లలకు విద్యాబుద్ధులు రావాలని, వారు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. చాలామంది వసంత పంచమి రోజునే చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని కూడా నిర్వహిస్తారు. ఇక ఈ సంవత్సరం వసంత పంచమి చాలా విశేషమైన వసంత పంచమిగా చెప్పవచ్చు.

ఈ సంవత్సరం వసంత పంచమి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వసంత పంచమి నాడు అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రం కలిసి వస్తున్నాయి. శుక్రుడు, కుజుడు, బుధుడు కలయిక వల్ల రవి యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడుతున్నాయి. మేషరాశిలో దేవగురువు బృహస్పతి, చంద్రుడు కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది.

 vasant panchami 2024: Vasant panchami today with amazing yogas; wealth for these zodiac signs!!

ఇక ఈ మూడు యోగాలు శుభ యోగాలు కావడంతో ఈ రోజు చాలా విశేషమైన రోజుగా చెప్పవచ్చు. అయితే వసంత పంచమి రోజు ఏర్పడబోతున్న యోగాల వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. ఇక ఆ రాశులు ఏమిటో... జరిగే ప్రయోజనాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వసంత పంచమి నాడు మేష రాశి వారికి గురుడు, శుక్రుడు, కుజుడు, బుధుడు, చంద్రుల కలయిక వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

మేషరాశి వారికి ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది. మేషరాశి జాతకులకు ఆస్తి కలిసొస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ సులభంగా అధిగమిస్తారు. ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

వసంత పంచమి నాడు ఏర్పడే త్రిగ్రాహి యోగం, గజకేసరి యోగం వల్ల మిధున రాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. జీవితంలో ఎదుర్కొంటున్న అనేక కష్టాల నుంచి మిధున రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పదోన్నతి కి కూడా అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పోరాటానికి ఫలితం దక్కుతుంది.

వసంత పంచమినాడు ఏర్పడే గజకేసరి యోగం, త్రిగ్రాహి యోగం వలన వృశ్చిక రాశి వారికి లబ్ధి జరుగుతుంది. వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పైన ఆసక్తిని చూపిస్తారు. ఈ సమయం వీరికి సంతోషకరంగా ఉంటుంది.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+