• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: లివింగ్ రూమ్ మరియు డైనింగ్ రూమ్ ఎలా ఉండాలి? వాస్తు ప్రకారం చెయ్యకూడనివేంటి?

|
Google Oneindia TeluguNews

మనిషి జీవితం పైన వాస్తు ప్రభావం ఎంతగానో ఉంటుంది. చాలా సందర్భాలలో ఎంత కష్టమైన పని చేసినప్పటికీ, సరైన ఫలితాన్ని పొందకపోవడం, డబ్బు సంపాదించినప్పటికీ అది నిలవకపోవడం, ఇంట్లో అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి అనేక సమస్యలు మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే అలాంటి సమయంలోనే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాస్తు దోషాలు లేని ఇంట్లో ఇటువంటి సమస్యలు అతి తక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

 లివింగ్ రూమ్ కు వాస్తు

లివింగ్ రూమ్ కు వాస్తు


ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని అన్ని గదులు ముఖ్యమైనవే. అయితే కుటుంబమంతా ఎక్కువగా కలిసి ఉండే లివింగ్ రూమ్ వాస్తు గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లివింగ్ రూమ్ ప్లాన్ చేయడానికి మరియు ఫర్నిచర్ ఉంచడానికి వాస్తు నియమాలు పాటిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక లివింగ్ రూమ్ ఏ విధంగా ఉండాలి? లివింగ్ రూమ్ ఉండాల్సిన దిశ లేంటి? లివింగ్ రూమ్ డెకరేషన్ ఏవిధంగా ఉండాలి అనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.

లివింగ్ రూమ్ దిశలు మరియు అలంకరణ

లివింగ్ రూమ్ దిశలు మరియు అలంకరణ

సాధారణంగా, అపార్ట్‌మెంట్‌లలో, లివింగ్ రూమ్ ప్రధాన ద్వారం లేదా ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా ఉంటుంది. లివింగ్ రూమ్ తూర్పు, ఉత్తర దిశల్లో ఉండాలి. లివింగ్ రూం ముందు ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండాలి మరియు తగినంత వెలుతురు ఉండాలి. శ్రేయస్సును ఆహ్వానించడానికి ప్రవేశ ద్వారం దగ్గర ఆశీర్వాదం ఇచ్చే బుద్ధుడి బొమ్మను లేదా తలుపు పైన ఒక జత ఏనుగు బొమ్మలను ఉంచండి. లివింగ్ రూమ్‌కు దారితీసే మార్గం విశాలంగా ఉండాలి మరియు గదిలోకి సాఫీగా ప్రవేశించేలా ఉండాలి.

భారీ ఫర్నీచర్ నైరుతి దిశలో ఉంచాలి

భారీ ఫర్నీచర్ నైరుతి దిశలో ఉంచాలి

లివింగ్ రూమ్ భారీ ఫర్నిచర్ లేకుండా ఉండాలి. ప్రధాన ద్వారం నుండి అదృష్టం ఇంటికి ప్రవేశిస్తుంది కాబట్టి దానిని సౌకర్యవంతంగా, మరింత అందంగా రూపొందించాలి. కాబట్టి, కొన్ని ఆకుపచ్చ మొక్కలను ఉంచవచ్చు, ఇది కూడా సానుకూల శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సరైన ఫర్నిచర్ ఏదైనా సౌకర్యవంతమైన నివాస స్థలంలో ముఖ్యమైన భాగం. వాస్తు శాస్త్రం ప్రకారం, సోఫాల వంటి భారీ ఫర్నిచర్ గదికి పశ్చిమ లేదా నైరుతి దిశలో ఉంచాలి. అయితే, టెలివిజన్ సెట్లు మరియు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి వస్తువులను ఆగ్నేయ ప్రాంతంలో ఉంచాలి

డైనింగ్ స్థానం ఇదే... వెయ్యాల్సిన రంగులు ఇవే

డైనింగ్ స్థానం ఇదే... వెయ్యాల్సిన రంగులు ఇవే

ఒకవేళ, మీ ఇంటిని డైనింగ్ మరియు లివింగ్ రూమ్ ఉండేలా డిజైన్ చేసి ఉంటే, డైనింగ్ స్పేస్‌ని గదికి తూర్పు లేదా ఆగ్నేయంలో ఉంచడం మంచిది. ఇదే సమయంలో లివింగ్ రూమ్ కు మరియు డైనింగ్ రూమ్ కు వేసే రంగులు కూడా మన శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి. లివింగ్ రూమ్‌లు మరియు డైనింగ్ రూమ్‌లకు సిఫార్సు చేయబడిన రంగులు ఆఫ్-వైట్, పింక్, లేత పసుపు మరియు ఇతర లైట్ రంగులు. భోజన ప్రదేశం తూర్పున ఉన్నట్లయితే, గోడలకు పసుపు, కుంకుమ కలర్ వేస్తే మంచిది. ఇది ఉత్తరాన ఉన్నట్లయితే, లేత ఆకుపచ్చ మరియు నీలం రంగులను ఎంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసేటప్పుడు టెలివిజన్ చూడటం మానుకోవాలని సూచిస్తున్నారు.

డైనింగ్ టేబుల్ దగ్గర గదిలో అద్దం ఉంటే మంచిది

డైనింగ్ టేబుల్ దగ్గర గదిలో అద్దం ఉంటే మంచిది

ఉదయాన్నే, అన్ని కిటికీలను తెరిచి, గది బాగా వెంటిలేషన్ వచ్చేలా చూసుకోవాలి అని చెబుతున్నారు. సూర్యకాంతి శుభ్రపరచడానికి దారితీస్తుంది. అంతేకాదు వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం చెక్కతో చేసిన డైనింగ్ టేబుల్స్ ఉత్తమం. భోజనాల గదిలో అద్దం ఉంచడం మంచిది. ఎందుకంటే ఇది టేబుల్‌పై ఆహారాన్ని రెట్టింపు చేసినట్టు చూపిస్తుంది. తద్వారా సమృద్ధిని సూచిస్తుంది. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా ప్రేరేపిస్తుంది. డైనింగ్ ఏరియాలో నలుపు మరియు గోధుమ రంగు షేడ్స్ ఉపయోగించడం మానుకోండి. ఈశాన్య భాగంలో పూర్వీకుల ఫోటోలను ఉంచవద్దు.

చెప్పులు మెయిన్ డోర్ దగ్గర ఉంచరాదు

చెప్పులు మెయిన్ డోర్ దగ్గర ఉంచరాదు

మెయిన్ డోర్ ముందు బూట్లు ఉంచకూడదు, ఎందుకంటే ఇది సానుకూల శక్తికి ప్రధాన మార్గం కాబట్టి అక్కడ చెప్పులు పెట్టరాదు. పాదరక్షల కోసం, ఓపెన్ షెల్ఫ్‌ల కంటే క్లోజ్డ్ షెల్ఫ్‌లు చాలా మంచివి. ఆహ్లాదకరమైన సువాసనలు మానసిక స్థితిని పెంచుతాయి మరియు గదిని తాజాగా చేస్తాయి. కాబట్టి, మీ గది సహజమైన పువ్వులు లేదా సుగంధ నూనెలతో మంచి వాసన వచ్చేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. గదిలో ఎండిన పువ్వులు ఉంచరాదని వాస్తు నిపుణుల సలహా .

English summary
What should the living room and dining room look like? Vastu Shastra says that one can lead a peaceful life without much trouble if he knows what to do, and what not to do according to Vastu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X