vastu tips: ఈ వీధిపోటు ఉన్న ఇంట్లో మగవారు మట్టి ముట్టుకున్నా బంగారమే!!
వాస్తు శాస్త్రంలో వీధిపోటుకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పారు. ఒక ఇంటిని కానీ స్థలాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కచ్చితంగా వీధిపోటు ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. సహజంగా చాలామంది వీధి పోటు ఉంటే ఆ గృహాలను కొనుగోలు చేయకూడదని, స్థలాలను కొనుగోలు చేయకూడదు అని భావిస్తూ ఉంటారు. వీధిపోటు ఉన్న ఏ స్థాలమైనా నష్టం చేస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే అది చాలా తప్పు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అన్ని వీధిపోట్లు డేంజర్ కాదని, కొన్ని వీధిపోట్లు ఊహించని శుభ ఫలితాలను కూడా అందిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనవచ్చా?
శుభ ఫలితాలను అందించే వీధి పోటులలో ఉత్తర ఈశాన్యం వీధిపోటు, తూర్పు ఈశాన్యం వీధిపోటు మంచివని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక ప్రస్తుతం పశ్చిమ వాయువ్యం వీధిపోటు కూడా శుభ ఫలితాలను ఇస్తుందని, ముఖ్యంగా ఆయా స్థలాలలో, ఇళ్లలో నివసించే మగవారికి మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశలో ఇంటికి ఎదురుగా వీధి ఉన్నట్లయితే దానిని పశ్చిమ వాయువ్య వీధిపోటు గా పరిగణించాలని, పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పశ్చిమ వాయువ్య వీధిపోటుతో కలిగే ఫలితాలివే
పశ్చిమ వాయువ్య వీధిపోటు ఉన్న స్థలంలో గృహనిర్మాణం చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఈ వీధి పోటు పురుషులపై సత్ ప్రభావాన్ని చూపిస్తుంది అని, బయట వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అని చెబుతున్నారు. పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉన్న ఇంట్లో నివసించే వారికి రాజపూజ్యం, గౌరవ ప్రతిష్టలు, అన్నిచోట్ల ఆధిపత్యం లభిస్తుందని చెబుతున్నారు. చేసే వృత్తి, వ్యాపారాలలో, విద్యలోనూ అభివృద్ధి కలుగుతుంది. పశ్చిమ వాయువ్యం వీధిపోటు వల్ల గృహాలలో నివసించేవారికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పడి, ఫలితంగా అధికారం వస్తుంది.

రాజకీయాలలో బాగే ఎదిగే అవకాశం .. పురుషులకు లాభం
పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉన్న స్థలాన్ని ఎలాంటి సంశయం లేకుండా కొనుగోలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. పశ్చిమ వాయవ్య దిశలో వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వారు రాజకీయాలలో నాయకులుగా బాగా ఎదుగుతారని చెబుతున్నారు. ఇక పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉన్న ఇళ్లలో నివసించే పురుషులకు మట్టి ముట్టుకున్నా బంగారమే అన్నట్టు ఉంటుందని, ఇది మగవారికి బాగా లాభించే వీధిపోటు అని చెబుతున్నారు. కాబట్టి నిస్సంశయంగా పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉన్న ఇళ్లను కొనుగోలు చేసుకోవచ్చని చెప్పవచ్చు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications