vastu tips: ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలతో వాస్తు దోషాలకు చెక్; ఇంకా ఎన్నో లాభాలు!!
సాధారణంగా మామిడి ఆకులను శుభసూచకంగా పరిగణిస్తాం. ఇళ్లల్లో శుభకార్యాలు ఏవైనా, పండుగలు, పబ్బాలు ఏవైనా ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి వేడుకలను కొనసాగిస్తాం. అసలు ఇంతకీ మామిడితోరణాలు ఇంటిగుమ్మాలకు ఎందుకు కట్టాలి? మామిడి తోరణాలు కట్టడం వల్ల ఉపయోగం ఏమిటి? అనేవి చాలా మందికి తెలీదు.
హిందూ ధర్మంలో మొదటి నుంచి ఎలాంటి శుభసందర్భం అయినా మామిడి తోరణాలను కట్టడం ఆనవాయితీగా ఉంది కాబట్టి, ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ మామిడి తోరణాలను నేటికీ కడుతున్నారు. అయితే మామిడి తోరణాలు కట్టడం వెనుక అనేక సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

మామిడి తోరణాలతో పని వత్తిడి నుండి ఉపశమనం
మామిడి ఆకులు నిద్రలేమిని పోగొడతాయి అని, పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను తగ్గేలా చేస్తాయని, అంతే కాదు మామిడి కోరికలు నెరవేరేలా చేస్తుందని భావిస్తారు. మామిడి చెట్టు పళ్ళే కాదు, మామిడి ఆకులు కూడా ఉపయోగకరమని వాటిని పలు అనారోగ్యాలు తొలగించడం కోసం ఆయుర్వేదంలో వాడతారని చెబుతారు. ఇక శుభకార్యాలు నిర్వహించినప్పుడు మామిడాకులను ఎందుకు కడతారు అన్నదానికి అనేక కారణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

మామిడి తోరణాలతో ఇంట్లో ఆక్సిజన్ పెరుగుతుంది.. వాస్తు దోషాలు పోతాయి
మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లో గాలి పరిశుభ్రం అవుతుందని, తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుందని చెప్తారు. ఇంట్లో ఉండే ఆక్సిజన్ పెరగడం కోసం మామిడి తోరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు. ఇక ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఆ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు పోయి, పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపిస్తుందని తద్వారా అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్తున్నారు.

మామిడి ఆకుల్లో లక్ష్మీ కొలువు... మామిడి తోరణాలు కడితే ఆ ఇంట్లో ఐశ్వర్యం
సాధారణంగా మామిడాకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు. అందుకే మామిడి ఆకులతో చేసిన తోరణాలు కడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి చేరుతుందని, వారికి సిరి సంపదలు కలుగుతాయని చెబుతారు. ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉంటే ఆ శక్తులు బయటకు పోయి దేవతల అనుగ్రహం కలగడం కోసం మామిడాకులు కడతారని చెబుతారు. మామిడాకులు ప్రశాంతతకు చిహ్నం అని, మామిడాకుల తోరణాలను చూస్తే ఎవరికైనా ప్రశాంతత కలుగుతుందని చెబుతారు.
శుభానికి
సూచన
మామిడి
తోరణాలు..
ఇంటి
గుమ్మానికి
కడితే
సత్ఫలితాలు
ఆలయాలలోనూ
ఎలాంటి
శుభసందర్భం
అయినా
మామిడాకుల
తోరణాలు
కట్టడం
ప్రధానంగా
చూస్తూ
ఉంటాం.
భగవంతుడు
కొలువై
ఉండే
ఆలయాలలోనే
మామిడాకుల
తోరణాలకు
ప్రాధాన్యత
ఉంటే
అలాంటి
మామిడాకులను
ఇంట్లో
కడితే
ఫలితం
తప్పకుండా
ఉంటుందని
పెద్దలు
విశ్వసిస్తారు.
ఏది
ఏమైనా
మామిడి
ఆకులను
శుభానికి
సూచనగా
భావిస్తూ
ఇంటి
గుమ్మానికి
కట్టుకుంటే
సత్ఫలితాలు
ఉంటాయని
హిందూ
ధర్మ
శాస్త్రాలు
చెబుతున్నాయి.