Vastu tips: ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ రోగాలతో బాధపడుతున్నారా? కారణం ఇదే కావచ్చు!!

ఎప్పుడూ రోగాలతో బాధ పడుతున్నారా? తీవ్రమైన మానసిక అశాంతితో ఇబ్బంది పడుతున్నారా? ఏ పని చేస్తున్నా చిరాకు కలుగుతుందా? అయితే వాస్తు దోషాల ప్రభావం అయి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వాస్తు దోషాలతో పాటు ఇంటిలో మనం జీవించే విధానం, వస్తువుల అమరిక వంటి అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంటి కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసే ఉంటే కష్టమే

ఇంటి కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసే ఉంటే కష్టమే


వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణానికి ఏ విధంగా అయితే నియమాలు అవసరమో ఇంట్లో జీవించే విధానానికి అంతే నియమాలు అవసరం. చాలామంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకున్నామని, అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. అయితే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం మాత్రమే కాదు, తదనుగుణంగా ఇంటిని ఉపయోగించడం కూడా అవసరమే అని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలామంది ఇంటికి ఉన్న తలుపులు, కిటికీలు ఎప్పుడు తెరవకుండా మూసే ఉంచుతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో సంవత్సరాల తరబడి కిటికీలు మూసివేయబడి ఉంటాయి. కిటికీలు తెరిస్తే ఇంట్లోకి దుమ్ము వస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే అలా ఉంటే ఇబ్బంది పడాల్సింది మీరే అంటున్నారు.

గాలి, వెలుతురు రాని ఇళ్ళలో కుటుంబ సభ్యులకు అనారోగ్యం

గాలి, వెలుతురు రాని ఇళ్ళలో కుటుంబ సభ్యులకు అనారోగ్యం


వాస్తు శాస్త్ర నిపుణులు కిటికీలు తెరవకుండా ఉంచడం వాస్తు దోషం అని చెబుతున్నారు. కిటికీలు తెరవకుండా ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్లు అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్న గాలి బయటకు పోక, బయట ఉన్న ఆక్సిజన్ లోపలికి రాక, గాలి వెలుతురు ధారాళంగా లేని ఇంట్లో అనారోగ్యం బారిన పడతారని, వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడు కిటికీలు తెరిచే ఉంచాలని సూచిస్తున్నారు.

బాల్కనీ ఉంది అందుకే... వినియోగించండి

బాల్కనీ ఉంది అందుకే... వినియోగించండి


ఇంట్లో ఉన్న ప్రతి గదికి వాస్తు శాస్త్రం ప్రకారం ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకత ఉంటుందో, అదేవిధంగా బాల్కనీ కి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకత ఉంటుంది. చాలామంది బయట కూర్చోవాలంటే ఇబ్బంది ఫీలవుతూ ఉంటారు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ వుంటారు. కానీ బాల్కనీ ఉన్న ఇంట్లోని వారు, అప్పుడప్పుడు బయట కూర్చోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు. బయట కూర్చున్నప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వస్తుందని, సూర్యకాంతి మన పైన పడడం వల్ల మనకు కావాల్సిన డి విటమిన్ లభిస్తుందని, అప్పుడు ఆరోగ్యంగా ఉంటామని సూచిస్తున్నారు. అందుకే కచ్చితంగా బాల్కనీలను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు.

 గాలి, వెలుతురు బాగా వస్తేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ

గాలి, వెలుతురు బాగా వస్తేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ


ఇక ఇదే సమయంలో ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తే ఇల్లు పాజిటివ్ ఎనర్జీ తో నిండుతుంది అని, గాలి, వెలుతురు రాని ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ చేరుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ ఇంటి లోపల, బయటి లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. చీకట్లో ఉన్న ఇళ్లల్లో ఎప్పుడూ కుటుంబ సభ్యులు జబ్బుల బారిన పడి ఆందోళనలోనే ఉంటారు. ఇక ఈ సమస్య నుండి బయట పడాలంటే కచ్చితంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం తోపాటు, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+