మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం
దేవతల గురువైన బృహస్పతి జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని ప్రసాదించి, జీవిత లక్ష్యాన్నిచేరుకునేందుకు తోడ్పడతాడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఏప్రిల్ నెలలో బృహస్పతితో కలవనున్నాడు. వీరిద్దరి కలయికవల్ల గురు-సూర్య సంయోగం ఏర్పడుతోంది. దీనివల్ల నాలుగు రాశులకు అద్భుతమైన రాజయోగం పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
వృశ్చిక రాశి
ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం మార్గాలు దొరుకుతాయి. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు చేపడతారు. వాటిని తెలివితేటలతో నిర్వహించి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ధనస్సు రాశి
విదేశీ ప్రయాణాలు చేయాలని చూస్తున్నవారికి ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసివస్తుంది. షేర్ మార్కెట్ పెట్టుబడులు కూడా మంచి లాభాలనే అందిస్తాయి. ఈ సమయంలో ఈ రాశివారు ఎటువంటి పనులు చేసినా మంచి ప్రయోజనాలు అందుకుంటారు.
మేష రాశి
పెండింగ్ పనులన్నీ ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఉద్యోగస్థులకు వేతనాలు పెరుగుతాయి. పదోన్నతులున్నాయి. ఈ రాశివారికి సమాజంలో హోదా పెరుగుతుంది. గౌరవం కూడా అదే స్థాయిలో దక్కుతుంది. ఎప్పటినుంచో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నవారికి అది చాలా మంచి సమయం.
సింహరాశి
సూర్యుడి ప్రభావంతో ఈ రాశివారికి ఒకరకంగా చెప్పాలంటే బంగారు యుగం ప్రారంభం కాబోతోదని చెప్పొచ్చు. అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వం తరఫున కాంట్రాక్టుల కోసం ప్రయత్నిస్తున్నవారికి భారీ లాభాలున్నాయి. తండ్రి వైపు నుంచి భారీగా ఆస్తి కలిసివస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి గుర్తింపు తెచ్చుకుంటారు.
-
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications