బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! (వీడియో)

ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్న డ్వేన్ బ్రావో ఓ మీడియా ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే డ్వేన్ బ్రావో ఓ వివాదంలో చిక్కుకున్నారు. గౌతమ్ గంభీర్ స్థానంలో కేకేఆర్ మెంటర్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రావో తన అజాగ్రత్త వల్ల ఇబ్బందుల్లో పడ్డారు. మైక్ ఆన్‌లో ఉన్న సంగతి తెలియక ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

అసలేం జరిగిందంటే?
ఓ మీడియా ఈవెంట్‌లో కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్, కెప్టెన్ అజింక్య రహానేలతో కలిసి బ్రావో వేదకపై ఉన్నారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉందనే విషయాన్ని గమనించని బ్రావో.. రహానేతో వ్యక్తిగత సంభాషణ చేస్తూ.. "వీళ్లు నాకు ఫోన్ చేసినప్పుడు.. నా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.." అంటూ ఏదో చెప్పబోయారు. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ అజింక్యా రహానే.. మైక్ ఆన్‌లో ఉందని సైగ చేయడంతో డ్వేన్ బ్రావో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన తప్పు తెలుసుకున్న ఆయన వెంటనే అసహనానికి లోనవుతూ 'షిట్' అని అనడం వీడియోలో రికార్డ్ అయింది.

KKR Mentor Dwayne Bravo Lands in Controversy Two Girls at Home Remark Caught on Live Mic

సోషల్ మీడియాలో విమర్శల వర్షం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు బ్రావోపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడారని కొందరు మండిపడుతుంటే.. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు ఆయన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అయి ఉండవచ్చని.. కేవలం సగం వీడియో చూసి ఆయనను తప్పుబట్టడం సరికాదని బ్రావో అభిమానులు వాదిస్తున్నారు.

గతంలో హార్దిక్ కూడా..
బ్రావో చేసిన ఈ కామెంట్స్ గతంలో హార్దిక్ పాండ్యా 'కాఫీ విత్ కరణ్' షోలో చేసిన వివాదాస్పద కామెంట్లను గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో హార్దిక్ కూడా మహిళల పట్ల చేసిన కామెంట్స్ వల్ల నిషేధానికి గురై.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు బ్రావో కూడా అదే తరహాలో ఇబ్బందుల్లో పడతారా అన్నది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+