Vastu tips: ఉదయం లేవగానే వీటిని అస్సలు చూడొద్దు.. దరిద్రం!!
చాలామంది నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. అయితే అద్దంలో నిద్ర లేచిన వెంటనే ముఖం చూసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. అది జీవితంలో దురదృష్టాన్ని తీసుకువస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నిద్ర లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్లి ఎంగిలి పాత్రలను చూడడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.
అందుకే ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత వెంటనే ఆ పాత్రలు శుభ్రం చేసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచించారు. ఇక నిద్ర లేచిన వెంటనే చాలామంది ఇళ్లల్లో పెట్టుకునే వివిధ వస్తువులను చూస్తూ ఉంటారు. కొంత మంది ఇళ్లల్లో అడవి జంతువుల బొమ్మలు, హింసాత్మకమైన ఘటనల ఫోటోలు, చాలా బాధాకరంగా ఉన్న ఆర్ట్ వంటివి పెట్టుకుంటూ ఉంటారు. వాటిని నిద్ర లేచిన వెంటనే పొరపాటున కూడా చూడకూడదు.

అసలు అటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ వస్తువులు కూడా ఆ విధమైనవే ఉండాలి. చాలా మంచి నిద్ర లేచిన వెంటనే వ్యాయామం మరియు యోగా చేస్తారు. ఇక అటువంటి వారు ఈ క్రమంలో వారి నీడను చూసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.
పొరపాటున కూడా యోగా, వ్యాయామం చేసే సమయంలో నీడను చూసుకోకూడదు. అలా చూసుకుంటే అరిష్టమని చెబుతున్నారు ఉదయాన్నే నీడను చూడడం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతున్నారు. పశ్చిమ దిశలో నీడ చూడటం మరీ ముఖ్యంగా మంచిది కాదని పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నెగిటివ్ ఎనర్జీ ని తీసుకువచ్చే వేటిని కూడా చూడకూడదని, అవి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications