Vastu tips: ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చెయ్యొద్దు; చేస్తే దరిద్రం!!

ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత ఉదయం మనం చేసే పనులు ఆరోజు మనకు ఏ విధంగా ఉంటుందో చెబుతుంది. చాలామంది నిద్రలేచిన వెంటనే చేయకూడని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఫలితంగా ఆరోజు వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎవరైతే రోజును బాగా ప్రారంభిస్తారో వారికి ఆరోజు మంచిరోజుగా ఉంటుంది.

అయితే నిద్ర లేచిన వెంటనే మనకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అసలు నిద్ర లేచిన వెంటనే చేయకూడని పనులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. చాలామంది నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. అయితే అద్దంలో నిద్ర లేచిన వెంటనే ముఖం చూసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.

Vastu tips: Dont do these things when you wake up in the morning.. Poverty will come!!

అది జీవితంలో దురదృష్టాన్ని తీసుకువస్తుంది. నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల శక్తుల ప్రభావం పడుతుంది.అంతేకాదు నిద్ర లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్లి ఎంగిలి పాత్రలను చూడడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఎవరైనా సరే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత వెంటనే పాత్రలు శుభ్రం చేసుకోవాలి కానీ, ఎంగిలి పాత్రలను ఇంట్లో పెట్టి పడుకోకూడదు.

ఇక నిద్రలేచిన వెంటనే ఎంగిలి పాత్రలను చూస్తే పాజిటివ్ ఎనర్జీ పోయి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే తన నీడను గాని ఎవరి నీడను గాని చూడకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పని రాహువుకు సంకేతంగా ఉంటుంది. ఫలితంగా రాహువు కష్టాలను ఇస్తాడు. చాలామంది ఉదయం నిద్ర లేచిన వెంటనే గడియారాలను చూస్తూ ఉంటారు.

ఇంట్లో ఆగిపోయిన, పగిలిపోయిన గడియారాలను నిద్ర లేచిన వెంటనే అస్సలు చూడకూడదు. అంతేకాదు కొంత మంది ఇళ్లల్లో అడవి జంతువుల బొమ్మలు, హింసాత్మకమైన ఘటనల ఫోటోలు, చాలా బాధాకరంగా ఉన్న పెయింటింగ్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటారు. వాటిని నిద్ర లేచిన వెంటనే పొరపాటున కూడా చూడకూడదు. ఇది అస్సలు మంచిది కాదు. ఈ పనులు మీకు దరిద్రాన్ని తీసుకువస్తాయి. కాబట్టి జాగ్రత్త.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+