Vastu tips: ఇంట్లో తరచూ గొడవలా? అయితే ఈ వాస్తు టిప్స్ మీ కోసమే!!
ఏ కుటుంబంలో అయినా గొడవలు సర్వసాధారణం. అయితే ఇంట్లో జరిగే గొడవలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసి చిరాకు కలిగిస్తాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే కచ్చితంగా వాస్తు దోషాలు ఉన్నాయని గుర్తించాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో సామరస్యం కొనసాగించడానికి, కుటుంబంలో గొడవలు నివారించటానికి వాస్తు చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది.
ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఇటువంటి గొడవలు ఇంట్లో ఎప్పటికీ జరుగుతూ ఉంటాయని చెబుతున్నారు.ఇక ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగించడానికి చేయవలసిన పనుల్లో మొదటిది ప్రతి గదిలోనూ మూలలో రాక్ సాల్ట్ ను ఉంచండి. గది మూలలో రాక్ సాల్ట్ ను ఒక నెల రోజుల పాటు ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి.

నెల రోజుల తర్వాత మళ్లీ రాక్ సాల్ట్ ను మార్చి మళ్లీ కొత్తగా ఉప్పును పెడితే ప్రతికూల ఫలితాలు నుండి కాపాడుకోవచ్చు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గుతాయి. కుటుంబ కలహాలకు ఇంట్లో ఉన్న మురికి కూడా కారణం అవుతుంది. ఇల్లు మురికిగా ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరుగుతాయి. అందుకే ఇంట్లో ప్రతి మూలను కచ్చితంగా శుభ్రం చేయాలి.
ఇంట్లో ఏ మూలలో అయినా ధూళి, దుమ్ము,చిందర వందరగా వస్తువులు ఉంటే ఆ ఇంట్లో చిరాకు ఉంటుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇంట్లో పూర్వీకుల చిత్రాలను దేవుడి గదిలో, హాల్ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టటం మంచిది కాదు.
పూర్వీకుల చిత్రాలను కచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టుకునేలా చూడాలి. అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. చిరాకు తగ్గుతుంది. ఇంట్లో వాటర్ ఫౌంటెన్ , బుద్ధుడి విగ్రహం కూడా ఇంట్లో గొడవలను దూరం చేసి కుటుంబానికి ప్రశాంతతనిస్తుంది. ఇంట్లో గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లో భోజనం చెయ్యాలి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications