వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: దక్షిణం దిక్కు ప్రాధాన్యత: ఇంటికి దక్షిణం వాస్తు బాగుంటే అద్భుత ఫలితాలు!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో ప్రతి దిక్కుకు ఒక విశిష్టత ఉంది. ఇక వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దక్షిణ దిక్కు విశేషమైన శుభఫలితాలను, అంతే తీవ్రమైన అశుభ ఫలితాలను కూడా ఇస్తుంది. దక్షిణ దిక్కు వాస్తు సరిగ్గా ఉంటే ఆ ఇల్లు సుఖసంతోషాలతో విలసిల్లుతోంది. దక్షిణ దిక్కులో వాస్తు దోషాలు ఉంటే మరణాలు సంభవిస్తాయని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అష్టదిక్కులలో దక్షిణం దిక్కుకు ప్రాధాన్యత అంతా ఇంతా కాదు

అష్టదిక్కులలో దక్షిణం దిక్కుకు ప్రాధాన్యత అంతా ఇంతా కాదు

అసలు దక్షిణం దిక్కు యొక్క ప్రాధాన్యత ఏంటి? దక్షిణం దిక్కు లో ఏ విధమైన వాస్తు దోషాలు ఉంటాయి? వాటిని తొలగించుకోవడం ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అష్ట దిక్కులలో దక్షిణ దిక్కున ఉండే ప్రాధాన్యత ఇంతా అంతా అని చెప్పడం అసాధ్యం. ఉదయాన్నే మనం తూర్పు అభిముఖంగా నిలుచున్నప్పుడు మన కుడి చేతి వైపు ఉండే దిక్కును దక్షిణ దిక్కు అంటారు. మన కుడిచేతిని దక్షిణ హస్తం అని కూడా అంటారు. దక్షిణ హస్తం సూచించే దిక్కు కాబట్టి దక్షిణ దిక్కు అని పేరు వచ్చింది.

 దక్షిణ దిక్కుకు దిక్పాలకుడు యముడు

దక్షిణ దిక్కుకు దిక్పాలకుడు యముడు


దక్షిణ దిక్కుకు దిక్పాలకుడు యముడు. దక్షిణ దిక్కుకు అధిపతి కుజుడు. యముడు ఋజువర్తనుడు, ధర్మాధర్మాలను విచారించి మనకు శుభఫలితాలను, అంతే అశుభ ఫలితాలను ఇచ్చే అత్యంత శక్తివంతమైన దేవుడు యమధర్మరాజు . దక్షిణ దిక్కు కాళ్ళు చాపి పడుకుంటే యమధర్మరాజు కఠినంగా శిక్షిస్తాడని చెబుతారు. దక్షిణం వైపు రోడ్లు ఉన్న స్థలాలను కొనడానికి కూడా చాలామంది భయపడుతుంటారు. దక్షిణం వైపు సింహద్వారం ఉన్న ఇళ్లను కొనడానికి కూడా చాలామంది ఆసక్తి చూపించరు.

దక్షిణ దిశలో వాస్తు దోషాలు లేకుంటే కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు

దక్షిణ దిశలో వాస్తు దోషాలు లేకుంటే కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు

కానీ వాస్తు శాస్త్ర పరంగా పరిశీలించినపుడు దక్షిణం దిక్కు ఎన్నో అధ్బుతమైన శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెబుతారు. దక్షిణ దిశలో తూర్పు అభిముఖంగా ఉన్న భాగాన్ని ఉచ్చ స్థానం అని, పడమర అభిముఖంగా ఉన్న భాగాన్ని నీచ స్థానం అని అంటారు. దక్షిణం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, బుద్ధి వికసిస్తుందని, శారీరక శక్తి మెరుగుపడుతుందని చెబుతారు . దక్షిణ దిశలో వాస్తు దోషాలు లేకపోతే చాలా మెరుగైన ఫలితాలు కలుగుతాయని గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు అని, ధనవంతులు అవుతారని, పెద్ద పెద్ద పదవిలో కొనసాగుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

దక్షిణ దిశలో కచ్చితంగా చెయ్యాల్సింది ఇదే!!

దక్షిణ దిశలో కచ్చితంగా చెయ్యాల్సింది ఇదే!!


దక్షిణ దిశలో కచ్చితంగా నడవడానికి కావలసినంత స్థలాన్ని వదిలిపెట్టి ఇళ్ల నిర్మాణం చేయాలి. లేదంటే ఆ ఇళ్లలోకి గాలి, వెలుతురు సరిగా ప్రచురించడం ఆ ఇళ్లలో ఉండే వారు అనారోగ్యంతో అవస్థలు పడతారు. ఇక అలాంటి గృహాలు పిశాచి గృహాలుగా పిలువబడతాయి అని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే దక్షిణం వైపు హద్దు చేసి ఇళ్లను కట్టుకోకూడదని దక్షిణ, పశ్చిమ దిశల్లో తక్కువగా, తూర్పు, ఉత్తర దిశల్లో ఎక్కువగా స్థలాన్ని వదిలిపెట్టి ఇల్లు కట్టుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణ దిశలో వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారికి మరణ భయం వేధిస్తోందని, వాస్తు దోషాలు లేకుండా వాస్తు శాస్త్ర నిపుణులు సలహాల మేరకు దక్షిణ దిశ పై తగిన జాగ్రత్తలు తీసుకొని ఇళ్ల నిర్మాణం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

English summary
Architecture says that if the architecture of the south of the house is good, wonderful results will come and if there are vastu defects, serious negative results will come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X