vastu tips: ఆ దిశలలో భోజనం ఎప్పుడూ చెయ్యొద్దు.. తినేటప్పుడు పాటించాల్సిన వాస్తుచిట్కాలివే!!
ఇంట్లో తప్పుడు దిశలో కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల కూడా వాస్తు దోషానికి గురవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసేటప్పుడు వాస్తు నియమాలను పాటించాలని, వాస్తు నియమాలను పాటించక పోతే వాస్తు దోషాలు కలుగుతాయి అని చెబుతున్నారు. భోజనం చేసేటప్పుడు వాస్తు నియమాలు పాటించని వారికి కలిగే వాస్తు దోషాల వల్ల కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారని చెబుతున్నారు.

వాస్తు దోషాల వల్ల ఇంట్లో సంపద, ఆహారం లేకుండా పోతుంది
వాస్తు శాస్త్రం మన జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. వాస్తు దోషాల వల్ల చాలాసార్లు మన ప్రగతికి, కుటుంబ సంతోషానికి, శాంతికి భంగం కలుగుతుంది. ఇంట్లో సంపద మరియు ఆహారం లేకపోవడానికి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు. అటువంటి లోపాలను నివారించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి.

తప్పుడు దిశలో కూర్చుని ఆహారం తీసుకుంటే వాస్తు దోషాలు
ఇంట్లో తప్పుడు దిశలో కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల కూడా వాస్తు దోషానికి గురవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు పొరపాటున కూడా తప్పులు చేయకూడదు అని సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం ఎప్పుడూ నేలపై కూర్చొని భోజనం చేయాలి. ఆహారం తీసుకునేటప్పుడు, మీ ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. ఆహారం తీసుకునేటప్పుడు ఉత్తరాభిముఖంగా లేక తూర్పు దిశ వైపు ఉండేలా కూర్చుని ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు, ఆహారం సమృద్ధిగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ దిశలలో కూర్చుని భోజనం చేయడం ఏ మాత్రం మంచిది కాదు
దీనికి విరుద్ధంగా, ఏ దిశలో కూర్చుని ఆహారాన్ని తిన్నా మీ సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. దక్షిణ దిశ, పడమర దిశ ఏమాత్రం భోజనం చేయడానికి అనుకూలమైన దిశలు కావని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశలలో కూర్చుని భోజనం చెయ్యటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి అని చెప్తున్నారు. అయితే, మీరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేస్తుంటే, మీ ముఖాన్ని ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉంచారా? ..భోజనం చేసేటప్పుడు టీవీలు చూస్తున్నారా?
మీ కుటుంబంలోని వ్యక్తులు డైనింగ్ టేబుల్ వద్ద ఆహారం తీసుకుంటే, దానిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దని చెబుతున్నారు. డైనింగ్ టేబుల్ పై ఎల్లప్పుడూ పండ్లు, స్వీట్లు లేదా ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చాలామంది ఆహారాన్ని తీసుకునేటప్పుడు శ్రద్ధ భోజనం పై కాకుండా, టీవీల మీద, సినిమాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు. భోజనం చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి భోజనం పైనే ఉండాలని, అప్పుడే అన్నపూర్ణ దేవి కటాక్షం ఎప్పటికీ కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

భోజనం వదిలిపెడుతున్నారా?
అంతేకాదు భోజనం చేసే సమయంలో చాలామంది తినేటప్పుడు శబ్దం వచ్చేలా భోజనం చేస్తూ ఉంటారు. అదికూడా దోషమని, అలా తినేటప్పుడు నోరు శబ్దం రాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. చాలామంది భోజనం చేసేటప్పుడు ప్లేట్ లో ఎంతో కొంత ఆహారాన్ని వదిలేస్తూ ఉంటారు. ఇలా ఆహారాన్ని వదిలి పెట్టడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
సండే స్పెషల్ "కడక్‌నాథ్ కోడి మాంసం".. నాటు కోడి కంటే బెస్ట్ టేస్ట్ ? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!











Click it and Unblock the Notifications