వాస్తు ప్రకారం తూర్పు దిశ ఇంటికి లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి.. తెలుసుకోండి!

వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పటికీ కొందరిని సమస్యలు వెంటాడుతుంటాయి. అటువంటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి, వారు చెప్పినదాని ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే వాటి నుంచి బయటపడతారు. అలాగే చాలామంది తూర్పు దిశగా ఉన్నటువంటి ఇంటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇది అన్నిరకాలుగా కలిసివస్తుందనే భావం అందరిలో ఉంటుంది. ఇంటి సింహ ద్వారం మిగిలిన తలుపుల కంటే పెద్దదిగా, ఆకర్షణీయంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం వాస్తు ప్రకారం.

తూర్పు వైపు ఇల్లు ఉంటే మాస్టర్ బెడ్ రూం నైరుతి దిశలో ఉండాలి.
వంటగది ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి.
సూర్యరశ్మి నేరుగా పడటం వల్ల ఇంట్లో పడటంవల్ల బ్యాక్లీరియా నశిస్తుంది.
గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి.
దీనివల్ల ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు.

Vastu Tips the east direction of a house has not only advantages but also disadvantages

తూర్పు దిశకు అధిపతి ఇంద్రుడు.
ఆయన వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
విద్యార్థులకు ఏకాగ్రత కుదురుతుంది.
మనసును తూర్పు దిశ చాలా ప్రశాంతంగా ఉంచుతుంది.
ఇంట్లోని మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తూర్పువైపు ఇంటికి మెయిన్ డోర్ ఈశాన్యం వైపు ఉండాలి.
ఆగ్నేయం మూలకు జరిగితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి.
అందరికీ అనారోగ్యం కలుగుతుంది.
ప్రధాన ద్వారానికి ఎదురుగా స్తంభాలు, చెట్లు ఉండకూడదు.
పెద్ద పెద్ద గోడలు కూడా ఉండకుండా చూసుకోవాలి.
దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇంటి తూర్పు భాగం, పశ్చిమ భాగం కంటే తక్కువ ఎత్తులో ఉండాలి.
తూర్పు వైపు ఎక్కువ బరువులు పెట్టడం లేదా ఎత్తుగా గోడలు కట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది.
తూర్పు ద్వారం వద్ద మురికి నీరు నిలవకూడదు.
ఆ దిశలో చెత్తబుట్టలు పెడితే ప్రతికూల శక్తి పెరిగి ఇంట్లో అశాంతి నెలకొంటుంది.

ప్రధాన ద్వారానికి ఎప్పుడూ పచ్చని మామిడి ఆకుల తోరణం ఉండాలి.
శుభప్రదమైన చిహ్నాలు ఓం, స్వస్తిక్ ఉంచడం మంచిది.
సాయంత్రం వేళల్లో కూడా ప్రధాన ద్వారం వద్ద వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
సింహ ద్వారం మిగిలిన తలుపుల కంటే పెద్దదిగా ఉండాలి.
మిగిలిన తలుపులకంటే ఎంతో ఆకర్షణీయంగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+