vastu tips: ఇంట్లో ఏ దిశలో నిద్రిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? తెలుసుకోండి!!
నిద్రించే దిశలు మన జీవితం పైన ప్రభావం చూపిస్తాయి. వాస్తు శాస్త్రంలో నిద్రించే దిశలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిద్రించే దిశ మన జీవితంలో శుభ, అశుభ సంకేతాలను కలిగిస్తుంది. నిద్రించే దిశ విషయంలో జాగ్రత్త లేకుంటే అనేక ప్రతికూల ఫలితాలను చూడాల్సి వస్తుంది.
కాబట్టి ఏ దిశలో తల పెట్టి పడుకోవాలి? ఏ దిశలో తల పెట్టి పడుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? అనేది తెలుసుకొని తదనుగుణంగా నిద్రించవలసిన అవసరం ఉంది. ప్రతి రోజు ఇంట్లో మనం నిద్రించే దిశ రక రకాల ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. సహజంగా నిద్రించేటప్పుడు నైరుతి వైపు తల పెట్టి, ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్రించాలి అని చెబుతారు.

అయితే నైరుతి వైపు మాత్రమే కాకుండా, కొన్ని శుభ ఫలితాలను కలిగించే దిశలు కూడా ఉన్నాయి. ఆ దిశలో తల పెట్టి నిద్రిస్తే మంచిదని చెబుతున్నారు. తూర్పు దిశకు తల పెట్టి నిద్రిస్తే ఆ వ్యక్తి జీవితంలో సుఖం, సంతోషం కలుగుతాయని చెబుతారు. దక్షిణ దిశలో తల పెట్టి నిద్రపోతే కీర్తి ,విద్య, శాంతి కలుగుతాయని, ఈ దిశ కూడా నిద్ర కు ఎంతో మంచిదని చెబుతున్నారు.
నైరుతి వైపు తల పెట్టి నిద్ర పోతే మంచి అభివృద్ధి చెందుతారని చెబుతున్నారు. పడమర దిశకు తల పెట్టి నిద్ర పోతే చిరాకు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈశాన్యం వైపు తల ఉంచి నిద్రపోతే కలహాలు, రుణాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని చెబుతున్నారు. ఆగ్నేయం వైపు తల ఉంచి నిద్రపోతే రుణబాధలు కలుగుతాయని చెబుతున్నారు.

వాయువ్యం వైపు తల ఉంచి నిద్రపోతే అనేక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.ఉత్తరదిశలో తల పెట్టి నిద్రిస్తే చాలా ప్రమాదం జరుగుతుందని, అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుందని, మరణం కూడా సంభవించవచ్చునని చెబుతున్నారు. అంటే పడుకునేటప్పుడు దిశలను గురించి తెలుసుకొని మనకు శుభఫలితాలను కలిగించే దిశ వైపు తలపెట్టి నిద్ర పోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications