84ఏళ్ళ తర్వాత ఆగస్ట్ లో అద్భుతయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతున్నారు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది సూర్యుని చుట్టూ తిరిగే రెండవ గ్రహంగా మన సౌర వ్యవస్థ లోనే అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెబుతారు. రాత్రి వేళల్లో చంద్రుడు తర్వాత అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహం శుక్రుడు. అటువంటి శుక్రుడు జ్యోతిష్యంలో ప్రేమ, అందం, శ్రేయస్సు, విలాసాలు, కళలకు కారకుడిగా చెబుతారు.

శుక్రుడు, యురేనస్ వల్ల ద్వి ద్వాదశ యోగం
ఇక శుక్రుడు ఆగస్టు ఒకటవ తేదీన శక్తివంతమైన యోగాన్ని సృష్టించాడు. దీనిని ద్వి ద్వాదశ యోగం అంటారు. ద్వి ద్వాదశ యోగం అంటే ద్వి అంటే రెండు ద్వాదశ అంటే 12 . ఒక గ్రహం జాతకంలో రెండవ ఇంట్లో ఉన్నప్పుడు మరొక గ్రహం 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం శుక్రుడు, యురేనస్ వల్ల ద్వి ద్వాదశ యోగం ఏర్పడింది.

Venus changed their phase into wealthy and happy phase after 84 years with Dwi dwadasha Yoga

శుక్రుడు సృష్టించిన యోగంతో వీరికి లబ్ది
సహజంగా రెండు గ్రహాలు కలిసినప్పుడు రెండూ శుభగ్రహాలు అయితే శుభ యోగాలు, అశుభ గ్రహాలు అయితే అశుభ యోగాలు ఏర్పడతాయి. 84 సంవత్సరాల తర్వాత శుక్రుడు సృష్టించిన యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి 84 సంవత్సరాల తర్వాత ఏర్పడిన శుక్రుడి ద్వి ద్వాదశ యోగం అదృష్టాన్ని ఇస్తుంది. మిధున రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. వారి కెరీర్ మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి .జీవిత భాగస్వామితో సమస్యలు తొలగిపోయి వారు సంతోషంగా జీవిస్తారు. ఇల్లు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

తులారాశి
84 సంవత్సరాల తర్వాత తులా రాశి జాతకులకు శుక్రుడు, యురేనస్ వల్ల ఏర్పడిన ద్వి ద్వాదశ యోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వీరికి ఊహించని రూపంలో నగదు వస్తుంది. చాలాకాలంగా నిలిచిపోయిన ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధం మెరుగుపడుతుంది. నూతన వాహనాలు, ఇల్లు, నగలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుంభరాశి
84 సంవత్సరాల తర్వాత ద్వి ద్వాదశ యోగం వల్ల కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో కుంభ రాశి వారి దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక నగదు ప్రవాహం ఉంటుంది. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కలుగుతాయి. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+