గృహ పరిసరాలలో శుభాశుభ ప్రదమైన మొక్కలు
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మనం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లు ఉండాలి? ఏ చెట్లను పెంచుకుంటే ఏలాంటి శుభఫలితాన్ని ఇస్తాయి ? అసలు ఇంట్లో ఉండకూడని చెట్లు ఏవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం నూట మూడో అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా ఈ చెట్ల గురించి వివరించి చెప్పాడు. ద్వారకా నగర నిర్మాణ సందర్భంగా ఒక మహానగరాన్ని ఎలా నిర్మించాలో ఆ నగరంలో ఏ దిక్కున ఏవి ఉండాలో ఎవరెవరి నివాసాలు ఎంతెంత ఎత్తు, వెడల్పు, లోతులాంటి పరిమాణాలతో ఉండాలో వివరించాక చెట్ల ప్రస్తావన కూడా చేసాడు శ్రీకృష్ణుడు.
ఇంటి ఆవరణల్లో కేవలం శుభకరమైన చెట్లు, పూలతీగలు, ఫలాలనిచ్చే వృక్షాలు ఉండాలి. నిర్మాణం జరిగాక గృహాల ఆవరణల్లో ఏ మంచి చెట్లను ఉంచాలో నగరం లోపల ఉద్యానవనాలలో ఎలాంటి పూలతోటలను, చెట్లను పెంచాలో చూద్దాం. శుభప్రదమైన మొక్కలు పూలతీగల చెట్ల ఉండాలి. గృహస్థులు ఉండే గృహా ఆవరణలో కొబ్బరి చెట్టు ఉంటే ధన ప్రదం అవుతుంది. ఇంటికి ఈశాన్యంలోనూ, తూర్పు భాగంలోనూ ఈ చెట్లు ఉండాలి. తాటిచెట్టు ఎక్కడైనా ఉండొచ్చు. రాజు ఉండే ప్రాంగణాల తూర్పు దిక్కులో మామిడి చెట్టు ఉంటే సంపదలు కలుగుతాయి. మామిడి ఏ దిక్కున ఉన్నా శుభప్రదమే.

మారేడు, పనస, రేగు, నిమ్మచెట్లు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం. ఇవి దక్షిణంలోనూ ఇతర దిక్కులలోనూ ఉన్నప్పుడు ధనప్రద ఫలితాన్నిస్తాయి. ఈ చెట్లన్నీ గృహస్థుడికి ఎంతో వృద్ధిని చేకూరుస్తాయి. అల్లనేరేడు, దానిమ్మ, అరటి తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో ఉండే వారికి బంధువులతో సఖ్యత కుదురుతుంది. ఇవే దక్షిణం దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి కలుగుతుంది. సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కునైనా ఉండొచ్చు. సొర, మంచి గుమ్మడి, మోదుగ, దోస, ఇంటి ఆవరణలో ఉంటే మంగళప్రదాలు. మారేడు, వంగ శుభప్రదాలు. పండ్లనిచ్చే తీగెల రకాల మొక్కలు ఎక్కడైనా ఉండొచ్చు. శనగ ధాన్యపు మొక్కలు ఉన్నందువల్ల దోషం లేదు. చెరకు ఎక్కడున్నా పర్వాలేదు. అలాగే అశోక, శిరీషం, కదంబ వృక్షాలు శుభప్రదం. పసుపు, అల్లం మొక్కలు శుభకరాలు.
గ్రామంలోనూ, నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం. ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది. ఉదయాన్నే లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది. మాలతి, మొల్ల, కుందం, మాధవి, మొగిలి, నాగకేసరం, మల్లె, పొగడ, విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం మంచిది. వీటితో ఉద్యానవనాలను కూడా పెంచవచ్చు. ఇవి తూర్పు దక్షిణ దిశల్లో ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. గృహస్థుడు ఇలాంటి చెట్లను పూలు, పండ్ల తీగలను తన ఇంటి ఆవరణలో ఉండేలా చూసుకోవాలి.
అలాగే బూరుగ, చింత, వేప, వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఇవి అశుభకరాలు. ఉమ్మెత్త, రావి, ఆముదం, లాంటి చెట్లుకూడా ఇంట్లో ఉండటం మేలు కాదు. భూమిలోకి ఎక్కువ దూరం వేళ్ళు పాతుకొనిపోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు. బూరుగ చెట్టు వెలుపల అడవికే పరిమితం. ఇంట్లో మర్రి చెట్టు ఉంటే దొంగల భయం కలుగుతుంది. చింతచెట్టు ఇంట్లో ఉంటే ధనహాని. ఇలాంటి చెట్లు ఇళ్ళలో కాక వీధులలోనూ, వనాలలోనూ ఉండవచ్చు. బూరుగ విషయంలో అది ఇంట్లోకాని నగరంలో కాని ఉంటే దుఃఖప్రదం. కనుక అది లేకుండా జాగ్రత్త వహించాలి అని మనకు తెలుస్తుంది. పురాణకాలం లోనే పర్యావరణ వన సంరక్షణ గురించిన పూర్తి అవగాహన ఉన్నట్టు మనకు తెలుస్తుంది.
-
Todays Horoscope:ఈ రాశి వారికి ధన యోగం..రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటే..? -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం! -
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే? -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్











Click it and Unblock the Notifications