వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

astrology: ఇంటిముందు కుక్కలు ఏడిస్తే దేనికి సంకేతం? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

|
Google Oneindia TeluguNews

కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించడమే కాకుండా, కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీ లను కూడా కుక్కలు చూస్తాయని చెబుతూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బలంగా విశ్వసిస్తారు. చాలామంది దీనిని మూడ విశ్వాసం అని కొట్టి పారేస్తారు.

కుక్కల విషయంలో గ్రీకుల నుండే రకరకాల విశ్వాసాలు

కుక్కల విషయంలో గ్రీకుల నుండే రకరకాల విశ్వాసాలు

కుక్క ఏడిస్తే అరిష్టమని, అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతుంటారు. ఇక జ్యోతిష శాస్త్ర నిపుణులు ఇది నిజమేనని చెబుతారు. ఇక అసలు విషయానికి వస్తే అసలు కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుండి వచ్చింది. కుక్కలు దుష్టశక్తులను పసిగట్టగలవని, దెయ్యాలను చూడగలవని వారు ప్రగాఢంగా విశ్వసించే వారు. కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందన్న భావన కూడా అప్పటి నుండే మొదలైనట్లు తెలుస్తోంది.

కుక్కలు మరణాన్ని పసిగడతాయా... ఎలా?

కుక్కలు మరణాన్ని పసిగడతాయా... ఎలా?

కుక్కలు దెయ్యాన్ని చూడగలగడం, మరణాన్ని పసిగట్టడం అన్ని మూఢవిశ్వాసాలు అని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటిని విశ్వసించ వలసిన అవసరం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే, ఆ చుట్టు పక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి, కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయని చెప్పే వారు కూడా లేకపోలేదు. ఇక అదే సమీపంలో ఎవరైనా చనిపోతే కుక్క ఏడ్చింది కాబట్టే చనిపోయారు అని చెప్పేవారు లేకపోలేదు.

కుక్కల ఏడుపుకు కారణంపై రకరకాల ఊహలు

కుక్కల ఏడుపుకు కారణంపై రకరకాల ఊహలు

ఏది ఏమైనా కుక్క ఏడవడానికి దానికి ఆకలి కావడమో, అనారోగ్యమో కారణమని చెప్పేవారూ ఉన్నారు. అయితే జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కుక్క ఏడవడం కీడు అని చెబుతుంటారు. అర్ధరాత్రి సమయంలో కుక్క అరుపు రాత్రి నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తే, అది మరణానికి సంకేతం అని చెప్తారు. కుక్క ఎటువంటి కారణం లేకుండా ఏడిస్తే, కనిపించని ఆత్మలను చూస్తున్నాడని అర్థం అని చెబుతారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కిటికీ వెలుపల కుక్క ఏడుస్తుంటే, ఆ వ్యక్తి చనిపోతాడని అపోహ ఉంది . అటువంటి సందర్భాల్లో ప్రత్యేకించి కుక్కను తరిమివేసినట్లయితే, అది మళ్లీ ఏడవడానికి తిరిగి వస్తుంది.

సైంటిఫిక్ గా నిరూపణ కానప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో ప్రగాఢ నమ్మకాలు

సైంటిఫిక్ గా నిరూపణ కానప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో ప్రగాఢ నమ్మకాలు


కుక్క బేసి సంఖ్యలో అరుస్తుంటే కూడా సమీపంలోని వ్యక్తి మరణాన్ని గుర్తు చేస్తున్నట్టుగా భావిస్తారు. కుక్క ముందు వాకిలి వద్ద నాలుగు సార్లు ఏడిస్తే, అది కూడా మరణానికి కారణమవుతుందని చెబుతుంటారు. ఏది ఏమైనా సైంటిఫిక్ గా ఇవన్నీ నిరూపణ కానప్పటికీ, జ్యోతిష శాస్త్ర నిపుణులు మాత్రం కుక్కల ఏడుపు అపశకునం అని చెప్పడం గమనార్హం.

English summary
Astrologers say about dogs crying in front of houses and dogs crying in mid night. It is said that when dogs cries, it is ominous, death occurs, and dogs can see ghosts. But none of this has been scientifically proven.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X