ఇంట్లో, ఆఫీసులో తాబేలుని ఎక్కడ పెట్టుకోవాలి? ఏ రకమైన తాబేలును పెట్టుకోవాలి?
ఈరోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, కార్యాలయాల్లో చూసినా తాబేలు కచ్చితంగా కనపడుతోంది. హిందూ పురాణాల్లో తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు సమస్యలను కూడా తొలగిస్తుంది. తాబేలు వల్ల అదృష్టం, సంపద, శ్రేయస్సు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో తాబేలు ఉంటే వాస్తు దోషాలన్నీ పటాపంచలవుతాయి. సానుకూల శక్తిని పెంచుతుంది. ప్రతికూల శక్తిని పారదోలుతుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒకరకంగా ఇంటికి రక్షణ కవచం అని చెప్పొచ్చు.
బంగారం, వెండి, ఇత్తడితో చేసిన తాబేలు విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం లేదా వాయువ్య దిశలోనే ఉంచాలి. ఇలా ఉంచితే చాలా శుభప్రదం.

స్పటిక తాబేలు
నీరు నిండిన పాత్రలో దీన్ని ఉంచాలి. ప్రతిరోజు నీటిని మార్చాలి. ఈశాన్య దిశలో ఉంచాలి.
లోహం తాబేలు
కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి వెళ్లాలనుకునేవారు దీన్ని కార్యాలయంలో ఉంచుకోవాలి. ఉత్తర దిశలో ఉంటే మంచిది.
చెక్క తాబేలు
దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల జీవితాలను ఆనందంగా ఉంచుతుంది. అందరినీ మంచివారుగా తీర్చిదిద్దుతుంది.
పిల్లలతో ఉన్న తాబేలు
పిల్లలతో ఉన్న తాబేలు కుటుంబానికి ప్రతీక. ఇది ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మద్య విభేదాలు తలెత్తవు.
తాబేలు విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలంటే
పిల్లల గదిలో ఉంటే మంచిది. అలాగే ఇంటికి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నా మంచిది. తాబేలు నోరు ఇంటి లోపలికి చూసేలా ఉండాలి. ఇది చాలా శుభప్రదం. పిల్లల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది.
తాబేలును పెట్టడానికి మంచిరోజు
క్యాలెండరులో మంచి సమయం చూసుకొని పసుపు పువ్వులతో తాబేలుకు కుంకుమ పెట్టాలి. ప్రతిరోజు దానిపై ఒక తులసి దళం ఉంచాలి. బుధవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో ఇంట్లో పెట్టుకోవచ్చు.
-
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
వాస్తు ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అద్దాలున్నాయా? -
కుంభరాశి, మీనరాశి మే నెల జాతక ఫలం -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications