హిందూ వివాహంలో ఒకే గోత్రం వారిని ఎందుకు పెళ్లి చేసుకోరు!!
హిందూ వివాహానికి మన దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హిందూమతంలో గోత్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూమతంలో పెళ్లి సమయంలో అబ్బాయి మరియు అమ్మాయి యొక్క గోత్రాన్ని కచ్చితంగా అడిగి తెలుసుకుంటారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి గోత్రం ఒకటే అయితే వారిద్దరు పెళ్లి చేసుకోరు.
హిందూమతంలో ఒకే గోత్రంలో వివాహం నిషేధించబడింది. అసలు ఒకే గోత్రంలో ఎందుకు వివాహం చేసుకోరు? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మతవిశ్వాసాల ప్రకారం గోత్రం ఋషులకు సంబంధించిందిగా పరిగణించబడుతుంది. ప్రాచీన కాలంలో ప్రధానంగా నాలుగు గోత్రాలను పరిగణించేవారు. తర్వాత మరొక నాలుగు గోత్రాలు చేర్చబడ్డాయి.

మొదట్లో అత్రి, జమదగ్ని, అగస్త్య, విశ్వామిత్ర గోత్రాలు ఉండేవి. అసలు గోత్రాలు అనేవి రక్తసంబంధీకుల మధ్య వివాహాన్ని ధరించడం కోసం ఏర్పాటు చేయబడింది. అప్పటినుంచి ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి, అమ్మాయి వివాహం చేసుకోకూడదని నియమం వచ్చింది. ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి, అమ్మాయి వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. కాబట్టి వీరి వివాహం చేసుకోకూడదని చెబుతారు.
ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయని, పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతోనో, మానసిక వైకల్యంతోనో పుట్టే అవకాశం ఉంటుందని చెబుతారు. ఇక కొందరి జ్యోతిష్యులు ఏడు తరాల తర్వాత గోత్రాన్ని మార్చుకోవచ్చని కూడా చెబుతారు. అంటే ఏడు తరాలుగా ఒకే గోత్రంలో కొనసాగుతూ ఉంటే ఎనిమిదవ తరానికి సంబంధించిన గోత్రానికి సంబంధించి వివాహ విషయాలను పరిశీలించవచ్చునని చెబుతారు.
అయితే ఒకే గోత్రం వారికి వివాహం చేసినట్లయితే, పుట్టే పిల్లలకు జన్యుపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అందుకే గోత్రానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు ఒకే వంశంలోని రక్త సంబంధీకుల మధ్య వివాహం జరగటం వల్ల ఆ వంశంలోని రోగాలు తరువాత తరాలకు బదిలీ అవుతాయని నమ్ముతారు. అందుకే గోత్రం ఒకటే ఉంటే వారిద్దరికీ వివాహం జరిపించరు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications