శ్రావణ మంగళవారం వ్రతం ఎందుకు చేయాలి..? దీని ప్రాధాన్యత ఏంటి..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత 'గౌరీదేవి'ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే 'మంగళగౌరీ వ్రతం'. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది.

Why Tuesday is considered as Auspicious day for Married women in sravana masam?

ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం 'పసుపుబొట్టు' వాయనములు ఇవ్వచును.

ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. పూజకు ఎర్రని పూలు, పచ్చని పూలు, ( గులాబిలు, చామంతి) గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితం, కుటుంబ జీవితం బాగుంటుంది. తప్పకుండా ఈ రోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజకూడా చేసి గోమాతకు తోచిన దాన వేసి మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+