చతుర్గ్రాహి యోగంతో ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులవుతున్నారు!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తున్నాయి. ప్రస్తుతం మీనరాశిలో నాలుగు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడింది. ఈ కలయిక మే మొదటి వారం వరకు ఉంటుంది. మీనరాశిలో బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువుల కలయిక అరుదైన చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది నాలుగు రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. చతుర్గ్రాహి యోగం కారణంగా మంచి ప్రయోజనాలను పొందుతున్న ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభరాశి జాతకులకు చతుర్గ్రాహి యోగం కలిసివస్తుంది. ఈ సమయంలో వృషభరాశి వారికి నూతన ఆదాయమార్గాలు తెరుచుకుంటాయి. ఏ పని చేసిన అదృష్టం వెన్నంటే ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభరాశి జాతకులు చాలా ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కెరీర్లో పురోగతి సాధించడానికి ఇది ఉత్తమకాలం. వైవాహికజీవితంలో శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

మిధున రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మిధునరాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాలలో కలిసి వస్తుంది. వ్యాపారాలను విస్తరించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వివిధ ఒప్పందాలను నుండి లాభాలు వస్తాయి. మిధునరాశి జాతకులు వ్యాపార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ కెరీర్లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది .సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. మీరు ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఇది మంచి సమయం.
ధనుస్సు రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభాలు చేకూరుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. జీవితం పట్ల సానుకూలమైన ఆలోచనతో ప్రవర్తిస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి సహాయంతో కొత్త అవకాశాలను పొందుతారు.
కుంభరాశి
చతుర్గ్రాహి యోగం కుంభ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. సృజనాత్మక రంగాలకు సంబంధించిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. పనిలో ప్రశంసలను పొందుతారు. ఈ సమయంలో కుంభ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమపూర్వకమైన సంబంధాలను కొనసాగిస్తారు. ఈ సమయం మీ జీవితానికి కొత్త దిశ నిర్దేశం చేయబోతుంది. క్రమశిక్షణతో పనులు పూర్తి చేస్తే, సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీ పని ప్రశంసించబడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications