త్వరలో శని దేవుడి దత్తపుత్ర యోగంతో ఈ రాశుల వారింటికి ధనరాసులు!
జ్యోతిష్య శాస్త్రంలో శనిని కర్మల దేవుడిగా చెబుతారు. అన్ని గ్రహాలలోను అత్యంత నిదానంగా ప్రయాణం చేసే శని ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. ఇలా 12 రాశులను శని పూర్తి చేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం శని దేవుడు మార్చి 29న తన రాశిని మారుస్తున్నాడు.
దత్తపుత్ర యోగం
రాశిని మార్చిన సమయంలో ద్వాదశ రాశులలో 5, 7, 9 వ గృహాలు బలహీనంగా ఉంటే దత్తపుత్ర యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ దత్తపుత్ర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి .
వృషభ రాశి వారికి శని సంచారం శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారికి దత్తపుత్ర యోగం కారణంగా ఉద్యోగ వ్యాపారాలలో ఆకస్మిక ధనలాభం చోటు చేసుకుంటుంది. ఇది అనుకూల సమయం. ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి మానసిక ఆనందం కలుగుతుంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
తులారాశి
శనిసంచారం కారణంగా ఏర్పడే దత్తపుత్ర యోగంతో తులారాశి జాతకులు లబ్ధిని పొందుతారు. తులా రాశి వారికి ఈ సమయంలో పదోన్నతులు లభిస్తాయి. తులారాశి వారి సంపద పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వారు లాభాలను పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం ఆర్థికంగా లాభాల బాటలో ప్రయాణిస్తుంది.
మకర రాశి
శని సంచారం వల్ల ఏర్పడే దత్తపుత్ర యోగంతో మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications