సెప్టెంబర్ లో త్రిగ్రాహి యోగంతో వీరికి అఖండ ధనయోగం, రాజభోగం!
సెప్టెంబర్ నెలలో గ్రహాల మార్పు ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం చూపిస్తుంది. సెప్టెంబర్ నెలలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది. కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అయితే సెప్టెంబర్ మాసంలో శుక్రుడు కుజుడు మరియు బుధుడు త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
సెప్టెంబర్ లో త్రిగ్రాహి యోగం
సెప్టెంబర్ నెలలో బుధ శుక్ర గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తున్నాయి. ఇక ఈ గ్రహాలతో పాటు కుజుడు కూడా ఒకే అమరికలోకి వచ్చినప్పుడు ఈ మూడు గ్రహాల గొప్ప కలయిక త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇక త్రిగాహి యోగం కారణంగా లబ్ధి పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
తులారాశి
సెప్టెంబర్ లో ఏర్పడే త్రిగ్రాహి యోగం కారణంగా తులారాశి వారికి మేలు జరుగుతుంది. శుక్రుడు, బుధుడు మరియు కుజుని కలయిక తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు కొంత ఆస్తిని సంపాదిస్తారు. న్యాయపరమైన విషయాలలో విజయాన్ని సాధిస్తారు. కళారంగానికి, సౌందర్యరంగానికి చెందిన ప్రముఖులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. పెళ్లికాని వారికి వివాహయోగం ఉంది..

ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అంగారకుడు, బుధుడు మరియు శుక్రుడు యొక్క గొప్ప కలయికతో ఏర్పడే త్రిగ్రాహి యోగం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు విద్యార్థులు విద్యారంగంలో విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి అంగారకుడు, బుధుడు మరియు శుక్రుడి యొక్క గొప్ప కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో శుభం జరుగుతుంది. కుంభ రాశి వారు రిస్క్ తీసుకోవడానికి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది అనుకూలమైన వాతావరణం. ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. లాటరీ గెలుచుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. స్నేహితులు బంధువులతో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications