Sankranti 2026 : అరుదైన కాంబినేషన్, ఇలా చేస్తే ఐశ్వర్యం మీ ఇంట్లోనే
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. అయితే అధిక మాసం కారణంగా ఈ సారి సంక్రాంతి రెండు తేదీల్లో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తెల్లవారు జామున పండుగ గడియలున్న రోజే మనం పండుగ రోజుగా భావించి పూజలు చేస్తాం. ఈ సారి సంక్రాంతి కూడా 14,15 తేదీల్లో వచ్చింది. ఇందులో మరో విశేషం కూడా దాగి ఉంది. ఇలాంటి సంక్రాంతి మళ్లీ 23 ఏళ్ల తర్వాతే అని పండితులు చెప్తున్నారు. మరి ఈ సంక్రాంతికున్న ప్రత్యేకత ఏంటి?
ఈసారి మకర సంక్రాంతి పండుగతో పాటు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన షట్టిల ఏకాదశి కూడా ఒకే రోజున రావడం విశేషంగా మారింది. సంక్రాంతి-ఏకాదశి కలయిక చాలా అరుదైనదిగా శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ మహాసంయోగం కారణంగా జనవరి 14వ తేదీకి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది.

మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణాన్ని దైవిక శక్తితో నిండిన కాలంగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఈ కారణంగా ఈ కాలంలో చేసే పూజలు, దానాలు, వ్రతాలకు అత్యధిక పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
2026 సంవత్సరానికి సంబంధించి శుభకార్యాల ప్రారంభానికి కూడా సంక్రాంతి అనుకూలంగా ఉంటుందని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. జనవరి 14 నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణాలు, కొత్త వ్యాపారాలు, ఇతర శుభకార్యాలకు మంచి రోజులు ప్రారంభమవుతాయని వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది అదే రోజున షట్టిల ఏకాదశి రావడం వల్ల ఈ తేదీ మరింత పవిత్రతను సంతరించుకుంది.
ఏకాదశి తిథి..
షట్టిల ఏకాదశి తిథి జనవరి 13 మధ్యాహ్నం 3.18 గంటల నుంచి జనవరి 14 సాయంత్రం 5.53 గంటల వరకు ఉంటుందని పండితులు తెలిపారు. జనవరి 14న మధ్యాహ్నం 2.50 గంటల నుంచి 3.07 గంటల మధ్య ఏకాదశి పరమ శుభసమయం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇవి చేస్తే ఉత్తమం..
శాస్త్రాల ప్రకారం ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి, శరీర-మనస్సు శుద్ధి అవుతుందని నమ్మకం. గంగా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయగలిగితే మరింత ఉత్తమమని చెబుతున్నారు.
ఐశ్వర్యం..
మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు, అక్షతలు, నల్ల నువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. దీని వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం.
పుణ్యఫలం లభిస్తుంది..
షట్టిల ఏకాదశి కావడంతో ఈ రోజున శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణ మంత్ర జపం చేయడం శుభఫలితాలను ఇస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు.
ఈ రోజున దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంది. నల్ల నువ్వులు, గోధుమలు, బెల్లం, బియ్యం, దుప్పట్లు, వస్త్రాలను పేదలకు దానం చేయడం ఎంతో శుభప్రదమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. షట్టిల ఏకాదశి సందర్భంగా చేసే దానాలు పితృదోష నివారణకు, కుటుంబ శ్రేయస్సుకు దోహదపడతాయని నమ్మకం.
సంక్రాంతి-షట్టిల ఏకాదశి మహాసంయోగంలో చేసే పూజలు, వ్రతాలు, దానధర్మాలు సాధారణ రోజులతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక పుణ్యఫలాన్ని ఇస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఈ ప్రత్యేక రోజును భక్తిశ్రద్ధలతో గడపాలని పండితులు సూచిస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications