సూర్యుడి సంచారం.. ఈ నాలుగు రాశుల వారికి దశ, దిశ తిరగబోతుంది..!

2026 ఫిబ్రవరి నెలలో ఆకాశంలో అద్భుతమైన గ్రహ గమనం చోటుచేసుకోబోతోంది. గ్రహాల రాజుగా పిలవబడే సూర్యభగవానుడు ఒకే నెలలో మూడుసార్లు తన స్థానాన్ని మార్చుకుంటూ, కొందరి జాతకాలను పూర్తిగా మార్చేయబోతున్నాడు. ఫిబ్రవరి 6న ధనిష్ఠ నక్షత్ర ప్రవేశం, ఫిబ్రవరి 13న కుంభ రాశిలోకి అడుగుపెట్టడం, ఆపై ఫిబ్రవరి 19న శతభిష నక్షత్ర సంచారం.. ఇలా సూర్యుడి వేగం నాలుగు రాశుల వారికి "రాజయోగం"లా మారబోతోంది.పేదరికం పోయి కోటీశ్వరులు అయ్యేంతటి అదృష్టం ఏ రాశుల వారిని వరిస్తుందో చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈ సూర్య సంచారం ఒక సువర్ణావకాశం. మీలో ఆత్మవిశ్వాసం ఉరకలెత్తుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు ఊహించని జీతాల పెంపు ఉంటుంది. పాత పెట్టుబడులు ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తాయి. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీలక పదవులు వరించే అవకాశం ఉంది.

సింహ రాశి

సూర్యుడు సింహ రాశికి అధిపతి కావడం వల్ల, ఈ మార్పు మీకు రెట్టింపు ఉత్సాహాన్ని, లాభాలను ఇస్తుంది.వాహనాలు లేదా స్థలాలు కొనాలనుకునే మీ కల ఈ సమయంలో నెరవేరుతుంది.కొత్త కాంట్రాక్టులు సంతకం చేస్తారు. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆగిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి సూర్యుడు మూడు రెట్ల ప్రయోజనాలను మోసుకొస్తున్నాడు.కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలతో పాటు అధికారం లభిస్తుంది.స్టాక్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టిన పెట్టుబడులు లాభాల బాట పడతాయి.

కుంభ రాశి

సూర్యుడు స్వయంగా మీ రాశిలోకి ప్రవేశిస్తుండటంతో, మీ దశ తిరగబోతోంది.మీ ఆలోచనా విధానంలో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి. వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి.ఇప్పుడు మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.

Surya Sancharam 2026 Sun Transit in February to Bring Fortune to 4 Zodiac Signs

ఈ నాలుగు రాశుల వారికి 2026 ఫిబ్రవరి నెల ఒక మలుపు వంటిది. సూర్యుడి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తొలగి, సుఖశాంతులు చేకూరబోతున్నాయి. మీ రాశి ఇందులో ఉంటే, శ్రమను నమ్ముకుని ముందుకు సాగండి.. విజయం మీదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+