• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ కు గుండు గీయించాలి: మంత్రి

By Staff
|

Pawan Kalyan
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుల పంచెలపై హీరో, ప్రజారాజ్యం నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద పెను దుమారం రేగుతోంది. "సంసారం సరిగా చేయలేని పవన్ కళ్యాణ్ నామీద విమర్శలు చేయడానికి తగడు"అని మంత్రి షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు. తాను వక్ఫ్ భూములను ఆక్రమించుకున్నానని నిరాధార ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ మీద పరువు నష్టం దావా వేస్తానని మంత్రి షబ్బీర్ హెచ్చరించారు. "పవన్ కళ్యాణ్ కు అరగుండు కొట్టించాలి" అని మరో మంత్రి ముఖేష్ గౌడ్ వ్యాఖ్యానించడం మరో విశేషం.

క్రిమినల్ పనులు చేయడంతో ఆనాడు పరిటాల రవి మనుషులు పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారని షబ్బీర్ అలీ ప్రస్తావించారు."ఒకరిని పెళ్ళి చేసుకుని, మరొకరితో కాపురం చేస్తున్న పవన్ కళ్యాణ్ నా మీద విమర్శలు చే సేటంత వాడా?" అని షబ్బీర్ అలీ విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X