టీడీపీని బాల్యకు వదిలేయరాదా?
హైదరాబాద్: "సినీగ్లామర్‌కు ఓట్లు రాలకపోతే బావమరిది బాలకృష్ణ, మేనల్లుళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రాం, తారకరత్నల వెంట ఎందుకు పడుతున్నారు? సినీనటుడు స్థాపించిన టీడీపీ అంత బలహీనంగా ఉందని భావిస్తే.. ఆ పార్టీని బాలకృష్ణకు వదిలేసి, కొత్త పార్టీ పెట్టుకోవచ్చు కదా!'' అని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రజారాజ్యం పార్టీ ఘాటుగా స్పందించింది.
నాడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను సైతం చంద్రబాబు ఇలాగే ఎద్దేవా చేశారని, తీరా గెలిచాక కొద్దిరోజులకే ఆయన పంచన చేరారని పీఆర్పీ రాజకీయ అధికార ప్రతినిధులు కోటగిరి విద్యాధరరావు, సి.రామచంద్రయ్యలు విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియీతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో ఒకసారి చేతులు కలిపి భంగపడ్డ కేసీఆర్.. ఇప్పుడు టీడీపీతో కలిసి అదే పొరపాటు మళ్లీ చేస్తారని భావించడం లేదన్నారు. చిరంజీవి నిర్వహించిన యాత్రలు, సభలకు టీఆర్‌ఎస్‌కు చెందిన యువతరం కదలి వచ్చిందని కోటగిరి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications